కమిటీల నిర్మాణం గురించి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్యేలతో ఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిటీల నిర్మాణం, పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, గత 20 రోజులుగా పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న స్పందనను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పార్టీ ఆదేశాల మేరకు 12వ తేదీ నాటికి గ్రామ కమిటీలు, గ్రామంలోని అనుబంధ కమిటీలు పూర్తి అయ్యాయి. అలాగే 20వ తేదీ నాటికి మండల కమిటీలు, మండల అనుబంధ కమిటీలు కూడా పూర్తి అయ్యాయి.


కమిటీల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో వాటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని మంత్రి సూచించారు. ఒకటి రెండు రోజుల్లో కమిటీల సమగ్ర సమాచారాన్ని అందిస్తామని ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్‌కి తెలిపారు. ఈ నెల 24న అసెంబ్లీ సమావేశాల కోసం హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఎల్లుండిలోగా కమిటీల నిర్మాణ తుది జాబితాలను పంపాలని కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు. గ్రామ మండల పట్టణ కమిటీల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో జిల్లా కమిటీలు, ఆ తర్వాత జరిగే పార్టీ ప్లీనరీపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  


Also Read: TS News: తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువు మరో నెల పొడిగింపు..


కంటి చికిత్స పరికరాల తయారీకి క్లస్టర్‌..
కంటి చికిత్స పరికరాల తయారీకి ముందుకొస్తే ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దీనిని సుల్తాన్‌పూర్‌లోని మెడికల్‌ డివైసెస్ పార్క్‌లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రపంచ స్థాయి వైద్య సంస్థలు హైదరాబాద్‌లో ఉండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్‌లో ఎల్వీ ప్రసాద్‌ ఐ టెక్నాలజీ అండ్‌ ఇంజనీరింగ్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం 80 శాతం వైద్య పరికరాలు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు.  దిగుమతులపై ఆధారపడకుండా దేశంలోనే ఉత్పత్తి జరగాలని ఆకాంక్షించారు.



Also Read: Political Challenges : తెలుగు రాష్ట్రాల్లో సవాళ్ల సీజన్ ! అందరూ కాస్కోమంటారు.. ముందడుగు వేసేదెవరు ?


Also Read: Hyderabad Raid Today: కార్వీ ఆఫీసు, ఆస్తులపై పలుచోట్ల ఈడీ దాడులు.. బెంగళూరు పోలీసుల కస్టడీకి మాజీ ఎండీ పార్థసారధి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి