Tragedy in Jammu and Kashmir: మరణం(Death) ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇలాంటి ఓ ఘోర దుర్ఘటనే కేంద్ర పాలిత ప్రాంతం(Union Territory) జమ్ము కశ్మీరు(Jammu Kashmir)లో చోటు చేసుకుంది. అనూహ్యంగా సంభవించిన అగ్ని ప్రమాదం(Fire accident) ఆరుగురి ఉసురు తీసింది. గాఢ నిద్రలో(Deep sleep) ఉన్న వారు.. ఆ నిద్రలోనే మృత్యు ఒడికి చేరుకున్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారి పరిస్థితిని గమనించిన అధికారులు.. మంటల కారణంగా తలెత్తిన పొగతో ఊపిరాడక.. వారు ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు. మిగిలిన నలుగురు బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
ఏం జరిగింది?
జమ్ము కశ్మీర్‌లోని కథువా(Kathuva) ప్రాంతంలో ఓ రిటైర్డ్.. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్..(DSP) తన కుటుంబంతో సహా అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో మొత్తం 10 మంది నివసిస్తున్నారు. ఎప్పటి లాగానే.. మంగళవారం(Tuesday) రాత్రి కూడా.. భోజనాలు చేసి.. కబుర్లు చెప్పుకొని.. నిద్రకు ఉపక్రమించారు. అందరూ చాలా సంతోషంగా కూడా ఉన్నారు. కానీ, తెల్లవారే సరికి వారిలో సగం మంది తుదిశ్వాస విడుస్తామని ఊహించి ఉండరు. అసలు ఆ విషయాన్ని కూడా వారు తలచి ఉండరు. కానీ, కాల బలీయమైంది. అగ్ని ప్రమాదం రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు .. ఆరుగురు కుటుంబ సభ్యుల ప్రాణాలను కబళించింది.
దారుణం..
కథువా.. గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్(GMC) ఎస్.కె. అత్రి(SK Atri) వెల్లడించిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ డీఎస్పీ ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఈ కుటుంబంలో మొత్తం 10 మంది వరకు ఉన్నారు. ఎప్పటిలాగానే మంగళవారం రాత్రి కూడా.. సంతోషంగా ఇంట్లో నిద్రించారు. అయితే.. అనూహ్యంగా బుధవారం తెల్లవారు జామున ఈ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలకు తోడు దట్టమైన పొగ ఇంటిని ఆవరించింది. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గమనించలేక పోయారు. మరోవైపు.. పొగ చుట్టేయడంతోవారికి ఊపిరి అందలేదు. ఈ ప్రమాదంలో ఊపిరాడక ఆరుగురు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
హుటాహుటిన చర్యలు
రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో మంటలు చెలరేగాయన్న సమాచారంతో అత్రి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. బాధితులను తక్షణమే సమీపంలోని ఆసుపత్రుల(Hospital)కు తరలించారు. ఇదే సమయంలో ఊపిరాడక మృతి చెందిన వారి భౌతిక కాయాల(Dead body)ను పోస్టు మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అత్రి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. ఇదేసమయంలో కార్పొరేషన్ కూడా కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. అగ్రిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటుందని ప్రాధమిక సమాచారం అందినట్టు వివరించారు.
ప్రాణ నష్టమే!
కథువాలోని రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్దగా ఆస్తి నష్టం జరగలేదని.. కమిషనర్ అత్రి(SK Atri) తెలిపారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా నలుగురు గాయపడ్డారని, గాయపడిన వారిలో పొరుగింటికి చెందిన వ్యక్తి కూడా ఉన్నారని తెలిపారు. ఊపిరి ఆడకపోవడమే(Suffocation) మరణానికి కారణమని నిర్దారణకు వచ్చినట్టు చెప్పారు. దీనిపై విచారణ(Investigation) కొనసాగుతుందన్నారు.