Telugu News Today: వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా - త్వరలో టీడీపీలో చేరే అవకాశం !
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ, వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భార్య టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వారు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత తన నియోజకవర్గంలో పలు చోట్ల అభ్యర్థుల్ని మార్చాలని ఆయన కోరారు. అయితే దానికి  సీఎం జగన్ అంగీకరించలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


 ఢిల్లీకి పవన్ కల్యాణ్ - నేడో , రేపో ఏపీ పొత్తులపై అధికారిక ప్రకటన
 జనసేన అధినేత పవన్ కల్యాణ‌్   ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. బీజేపీ   అగ్రనేతలతో ఆయన సమావేశం కానున్నారు. పొత్తులు, ఏపీలో రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించనున్నారు.  ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఆయన సమావేశమయ్యే అవకాశాలున్నాయి. అంతకు ముందు ఉదయం పవన్ కల్యాణ్ భీమవరంలో పర్యటించారు.  ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిని భీమవరంలో కలుసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


లోక్ సభ సీట్లపై కన్నేసిన బీఆర్ ఎస్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై పోస్టుమార్టం
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్(BRS) లోక్ సభ ఎన్నికల్లో అయినా పట్టునిలుపుకుని సత్తా చాటేందుకు  తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వెంటనే తేరుకున్న పార్టీ అధిష్టానం ఇప్పటికే ఒకసారి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షించింది. కీలక నేతలు కేటీఆర్(KTR), హరీశ్ రావు(Harishrao) పాల్గొని శ్రేణుల్లో ధైర్యం నింపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కొంత విరామం అనంతరం మళ్లీ లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాలు తిరిగి ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


టీడీపీ, జనసేనకు పొత్తు నొప్పులు - సీట్ల సర్దుబాటులో ఆలస్యం
ఈసారి కచ్చితంగా కొట్టి తీరాల్సిందే అనుకుని.. మాటా మాటా అనుకోకుండా ఓకే మాటగా నడుస్తున్న తెలుగుదేశం- జనసేన సీట్ల పంపకాల విషయంలో తంటాలు పడుతున్నాయా అంటే... పరిస్థితి అలాగే కనిపిస్తోంది. పార్టీ మీటింగుల్లో, పబ్లిక్ మీటింగుల్లో ఫ్రెండ్‌షిప్‌ను షేర్ చేసుకున్నంత తేలిక కాదు.. సీట్లను షేర్ చేయడం. ఆ పరిస్థితే ఇప్పుడు ఆ రెండు పార్టీలకు ఎదురవుతోంది. టీడీపీ పబ్లిక్ మీటింగుల్లో అన్యాపదేశంగా కాండిడేట్లను అనౌన్స్ చేస్తోందని విమర్శిస్తున్న జనసేన... ఇన్ కెమెరా మీటింగుల్లో అదే పనిచేస్తోందా..  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బీఈడీ అభ్యర్థులకు షాక్, ఎస్‌జీటీ పోస్టులకు అర్హతపై హైకోర్టు స్టే, ఆదేశాలు జారీ
సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT) పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఆ అభ్యర్థులను అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. బీఈడీ అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టులకు అనుమతించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై ఫిబ్రవరి 20న విచారణ చేపట్టిన కోర్టు.. ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి