Telugu News Today: 'రాప్తాడు అడుగుతోంది, వీటికి సమాధానం చెప్పు' - సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్
అనంతపురం జిల్లా రాప్తాడులో 'సిద్ధం' సభకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), సీఎం జగన్ (CM Jagan)కు సవాల్ విసిరారు. ఈ సభలో పలు ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 'రాప్తాడు అడుగుతోంది. జాకీ పరిశ్రమ ఎందుకు తరిమేశావని? అనంత అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని? రాయలసీమ రైతన్న అడుగుతున్నాడు నాటి డ్రిప్ పథకాలు ఎక్కడని.? సమాధానం చెప్పి సభ పెడతావా.? లేక సభలోనే సమాధానం చెబుతావా.?.' అంటూ ట్వీట్ లో ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తెలంగాణ కోసం త్వరలో 2050 మెగా మాస్టర్ ప్లాన్ - రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
నానక్ రామ్ గూడలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. గత ముప్పై ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కొనసాగిందని అన్నారు. అందుకే హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా మారిందని అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే.. మరింత ఉన్నతంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో అభిషేకం - అధినేతపై అభిమానం చాటుకున్న టీడీపీ నేత బుద్ధా వెంకన్న
 టీడీపీ నేత బుద్ధా వెంకన్న (Buddha Venkanna) పార్టీ అధినేత చంద్రబాబుపై (Chandrababu) తన అభిమానాన్ని చాటుకున్నారు. తన రక్తంతో చంద్రబాబు ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. రక్తంతో ఫ్లెక్సీలోని చంద్రబాబు కాళ్లు కడిగారు. అలాగే, 'చంద్రబాబు జిందాబాద్.. నా ప్రాణం మీరే' అంటూ గోడలపై రక్తంతో రాశారు. ఇది నిరసన కాదని.. చంద్రబాబుపై తనకున్న అభిమానం వల్లే ఇలా చేశానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సీఎం రేవంత్‌పై కవిత మాటలదాడి! తలా, తోక లేకుండా చేశారని విమర్శలు
ఎన్నికల వేడి ముగిసిన  కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) నేతల మధ్య కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), కేసీఆర్(KCR) కుటుంబ సభ్యుల మధ్య మాటల దాడి ఆగేలా కనిపించడం లేదు. శాసనసభలోనే కాదు..బయట కూడా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. కులగణనపై శాసన సభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత విరుచుకుపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


పవన్‌పై జగన్ సర్కార్ క్రిమినల్ కేసు - కోర్టుకు రావాలని ఆదేశాలు
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)పై వైఎస్ జగన్ (YS Jagan) ప్రభుత్వం క్రిమినల్‌ కేసు (Criminal Case) దాఖలు చేసింది. ప్రభుత్వం తన మానసపుత్రులుగా చెప్పుకుంటున్న వలంటీర్లపై పవన్ కల్యాణ్ గత ఏడాది జరిగిన సభలో అనుచితంగా మాట్లాడారంటూ ఆరోపించింది. వలంటీర్లను కించపరిచేలా, వారి మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్‌ కేసు దాఖలు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి