Telugu News Today: ఎలక్టోరల్ బాండ్ల గుట్టు విప్పిన ఈసీ- సంచలనం రేపుతున్న డేటా
సుప్రీంకోర్టు సంచలన తీర్పు మేరకు తొలిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ డేటాను ఈసీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించగా ఆ వివరాలను ఎన్నికల సంఘం తమ వెబ్ సైట్‌లో అధికారికంగా ప్రకటించింది. రెండు భాగాలుగా ప్రకటించిన 337 పేజీల డేటా ఆధారంగా 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి వరకూ 11వేల 671కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేశాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బీఆర్ఎస్ మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థుల ప్రకటన
బీఆర్ఎస్ పార్టీ మరో రెండు లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్ధులను ప్రకటించింది. ఆదిలాబాద్‌, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కును, మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఫిక్స్ చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వీరు ఇద్దరి పేర్లను అధికారికంగా నేడు (మార్చి 14) బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికలకు ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


అన్న అనుకున్న వాడే హంతకులకు రక్షణగా ఉన్నారు' - ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
వైఎస్ వివేకా హత్య కేసులో హంతకులు ఎవరో కాదని.. బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. మాజీ మంత్రి వివేకా ఐదో వర్థంతి సందర్భంగా కడపలో శుక్రవారం నిర్వహించిన స్మారక సభలో ఆమె మాట్లాడారు. 'అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు. చిన్నాన్న వైఎస్ వివేకా మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీత. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తున్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రేవంత్‌ను ప్రోత్సహించారు, నన్ను పట్టించుకోలేదు : ఏబీపీ దేశంతో పరిపూర్ణానంద స్వామి
భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా ధర్మాన్ని కాపాడేందుకు హిందువే ప్రధానిగా ఉండాలని పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగేందుకు పరిపూర్ణానంద స్వామి సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏబీపీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాలను పంచుకున్నారు ఆ వివరాలు ఆయన మాటల్లోనే. మతాలకు అతీతంగా రిజర్వేషన్లు ఉండాలి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి