BRS party News: బీఆర్ఎస్ పార్టీ మరో రెండు లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్ధులను ప్రకటించింది. ఆదిలాబాద్‌, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కును, మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఫిక్స్ చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వీరు ఇద్దరి పేర్లను అధికారికంగా నేడు (మార్చి 14) బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికలకు ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

ఇప్పటి వరకు 11స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..

1) ఖమ్మం: నామా నాగేశ్వర్ రావు

2) మహబూబాబాద్: (ఎస్టీ) మాలోత్ కవిత

3) కరీంనగర్: బోయినిపల్లి వినోద్ కుమార్

4) పెద్దపల్లి (ఎస్సీ): కొప్పుల ఈశ్వర్

5) మహబూబ్ నగర్: మన్నె శ్రీనివాస్ రెడ్డి

6) చేవెళ్ల: కాసాని జ్ఞానేశ్వర్

7) వరంగల్: (ఎస్సీ): డాక్టర్ కడియం కావ్య

8) జహీరాబాద్: గాలి అనిల్ కుమార్

9) నిజామాబాద్: బాజిరెడ్డి గోవర్ధన్

10) మల్కాజ్ గిరి: రాగీడి లక్ష్మారెడ్డి

11) ఆదిలాబాద్: ఆత్రం సక్కు