Telugu News Today: వెలిగొండ పూర్తి చేయడం దేవుడు రాసిన స్క్రిప్ట్ - ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్
వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్ధాల కల నెరవేరిందని, టన్నెల్‌లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ, అద్భుతమైనప్రాజెక్ట్ పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్ధాల కల నెరవేరిందని, టన్నెల్‌లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఢిల్లీ పరిణామాలపై గంటన్నరపాటు బాబు, పవన్ చర్చలు - ఇంతకీ ఢిల్లీ ఎప్పుడు వెళ్తున్నట్టు!
తెలుగుదేశం అధినే చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుమారు గంటన్నర పాటు ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. బీజేపీ పొత్తు, మొదటి లిస్ట్ ప్రకటించిన తర్వాత వెల్లువెత్తిన అసంతృప్తుల వ్యవహారం, ప్రకటించాల్సిన స్థానాలపై అనుసరించాల్సిన వ్యూహం గురించి మాట్లాడుకున్నారు. ఎక్కువ భాగం భారతీయ జనతా పార్టీతో పొత్తు వ్యవహారం గురించి డిస్కషన్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ అవసరాన్ని మించి సన్నిహితంగా మెలిగారా ? విమర్శలకు ఎలా సమాధానం ఇస్తారు ?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ నాయకుడు కంటే ముందు అచ్చమైన రాజకీయ నాయకుడు అని నిరూపించుకున్నారు. మోదీ పాలనను విమర్శిస్తూ.. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం చేసి ఎన్నికల్లో ప్రయోజనం పొందిన ఆయన ఇప్పుడు ప్రధాని మోదీ విషయంలో మాత్రం పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. చేవెళ్ల సభలో గుజరాత్ మోడల్ అంటే రైతుల్ని చంపడమేనని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి మోదీ వేదికపై ఉన్న స్టేజ్ మీద మాత్రం.. గుజరాత్ లాగా తెలంగాణను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీని బడే భాయ్‌గా అభివర్ణించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'వివేకానంద రెడ్డి హత్య వెనుక సీఎం జగన్' - అప్రూవర్ గా మారిన దస్తగిరి హాట్ కామెంట్స్
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ వివేక హత్య వెనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో రాజకీయంగా వేడిని పెంచుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి కూడా ఉన్నారన్నారంటూ దస్తగిరి పేర్కొన్నారు. అప్రూవర్ గా మారినందుకు తనను ఎలా అయినా ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు, పరీక్ష తేదీలివే
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024–2025 విద్యాసంవత్సర ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఐసెట్(TS ICET)-2024 నోటిఫికేషన్‌ను కాకతీయ యూనివర్సిటీ మార్చి 5న విడుదల చేసింది. ఈ మేరకు హనుమకొండలోని యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలోని టీఎస్ ఐసెట్ కార్యాలయంలో తొలుత సెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఐసెట్-2024 నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి