ఎన్ని తప్పులు చేయకూడదో అన్ని తప్పులు చేశారు - జగన్‌పై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయకూడదో అన్నిరకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 175 స్థానాల్లో జగన్ తరపున కాదు.. జగనే పోటీ చేస్తున్నారని ఉండవల్లి సెటైర్ వేశారు. రాష్ట్రంలో అర్బన్ ఏరియాల్లో జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు కనపడుతున్నాయని ఉండవల్లి జోస్యం చెప్పారు. వైసీపీ కంటే ఎక్కువగా ఇస్తామంటూ టీడీపీ మేనిఫెస్టో ప్రకటిస్తున్నారని, వీటన్నింటిని ప్రజలకు అందించడం ఎలా సాధ్యమనే విషయాలను ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఉండవల్లి అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఈ నెల 5, 6 తేదీలలో 3 చోట్ల చంద్రబాబు రా కదలిరా సభలు, ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఐదో తేదీన అనకాపల్లి జిల్లాకు రానున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జోరుగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సభలను నిర్వహిస్తున్నారు. రా కదలిరా పేరుతో నిర్వహిస్తున్న సభల్లో భాగంగా కార్యకర్తలు, ప్రజలనుద్ధేశించి చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఆయన కేడర్‌ను సంసిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సభలు నిర్వహించిన చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాలో తొలి ఎన్నికల సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వెంటనే గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు విడుదల చేయాలి- సీఎం రేవంత్‌కు బీజేపీ డిమాండ్లు ఇలా
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చిందని, మేనిఫెస్టోను పట్టించుకోవడం లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిదని రేవంత్ రెడ్డి అన్నారని.. ప్రతి హామీని అమలు చేస్తామని వందల సార్లు చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని చెప్పారు. కానీ సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి మాట తప్పుతున్నారని.. అందుకు సాక్ష్యం మీ మేనిఫెస్టోనే అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు?' - కేంద్ర బడ్జెట్ ను విమర్శిస్తూ కేటీఆర్ సంచలన ట్వీట్
మధ్యంతర బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపించిందని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించలేదని మండిపడ్డారు. బీజేపీకి (BJP) వ్యతిరేకంగా సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలుగు రాష్ట్రాల మధ్య హైస్పీడు ప్రయాణం, విశాఖ నుంచి హైదరాబాద్‌కు డైలీ సర్వీస్ చేయొచ్చు!
తెలుగురాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గిపోనుంది. మరీ ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే హైదరాహబాద్- విశాఖ మార్గంలో ఇక 4 గంటల్లోనే దూసుకపోవచ్చు. రెండు ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్ రైలు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే వందేభారత్ రైలు(Vandhe Bharath Train)తో సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని పొందుతున్న తెలుగు ప్రజలు హైస్పీడు రైళ్లు అందుబాటులోకి వస్తే ఇకపై రెండు నగరాల మధ్య డైలీ సర్వీసు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి