Top News Today IN Andhra Pradessh and Telangana on November 12 - ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం- ఆసక్తి రేపుతున్న ముగ్గురి పర్యటన
ఇన్ని రోజులు తెలంగాణకే పరిమితమైన కుంభకోణాల రాజకీయం ఇప్పుడు ఢిల్లీ చేరింది. తెలంగాణకు చెందిన కీలకమైన ముగ్గురు వ్యక్తులు హస్తినలో మకాం వేయడంతో రాజకీయం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటాయో అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తన వెళ్లారు. మరోవైపు గవర్నర్ ఢిల్లీ పర్యటన అనేక చర్చలకు దారి తీస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
యాంటీ "సోషల్"యాక్టివిటీలో ఇరుక్కుంటున్న కీలక నేతలు- మొన్న భార్గవ్, నిన్న అవినాష్, రేపు ఎవరు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సోషల్ మీడియా పోస్టింగ్స్, అరెస్టులు షేక్ చేస్తున్నాయి. నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పోస్టింగ్స్ పెడుతున్న వాళ్లంతా సాధరణ కార్యకర్తలే అనే ప్రచారం సాగింది. కానీ ఇదంతా ఆర్గనైజ్డ్‌గా జరుగుతున్న వ్యవహారమంటూ పోలీసులు చెప్పడం సంచలనంగా మారింది. దీంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అన్న ఆసక్తి నెలకొంది. వర్రా రవీందర్‌రెడ్డి అనే వైసీపీ యాక్టివిస్ట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
లగచర్ల ఘటనలో 50 మందికిపైగా అరెస్టు- ప్లాన్ ప్రకారమే అధికారులపై దాడి చేశారన్న పోలీసులు
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఐఏఎస్ సహా పలువురు ఉన్నత అధికారులపై జరిగిన దాడిలో 50 మందికిపైగా పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తతంగా మారకుండా ముందు జాగ్రత్తగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఆప్రాంతంలో ఇంటర్‌నెట్ కూడా నిలుపుదల చేశారు. ఇది అప్పటికప్పుడు జరిగిన ఘటన కాదని కుట్రపూరితంగా ముందస్త వ్యూహంతో జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ - సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయిన వారికి జీతాలుగా ప్రజాధనం ?
ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా కేసులు సంచలనం రేపుతున్నాయి. అరెస్టు అవుతున్న వారు గత ఐదేళ్ల కాలంలో పెట్టిన పోస్టులు అత్యంత జుగుప్సాకారంగా ఉన్నాయన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో వారు ఆ సమయంలో ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారని ఆధారాలు లభించినట్లుగా వర్రా రవీందారెడ్డిని అరెస్టు చేసిన విషయాన్ని ప్రెస్మీట్ పెట్టి చెబుతున్న సమయంలో డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
త్వరలో రేవంత్, పొంగులేటి పదవులు పోతాయి- ఢిల్లీలో కేటీఆర్ సంచలన కామెంట్స్
తెలంగాణలో జరిగిన అమృత టెండర్ల స్కాంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించి చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కి తెలంగాణ ఏటీఎంలా మారిందని ఆరోపించిన ఆయన... తెలంగాణలో జరుగుతున్న అవినీతిపైన స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి మహారాష్ట్ర ఎన్నికల్లో మాట్లాడడం కాదని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ఆర్ టాక్స్ ఆరోపణలపై చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి వివరాలు