కర్నూలు లో కొనసాగనున్న చంద్రబాబు మూడో రోజు  పర్యటన 
 
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కర్నూలులో మూడో రోజు పర్యటించనున్నారు. కర్నూలులోని మౌర్య హోటల్‌లో రాత్రి బస చేసిన ఆయన మధ్యాహ్నం 3 వరకూ అక్కడే ఉండనున్నారు. 3: 15కి కర్నూలు టీడీపీ ఆఫీస్‌కు చేరుకొని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 3:45కి అక్కడి నుంచి బయలుదేరి 4:40కు కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో సాయంత్రం 5:40కి గన్నవరం చేరుకొని ఉండవల్లిలోని నివాసానికి వెళతారు


కడప లో పర్యటించనున్న జనసేన పొలిటికల్ ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్ :. 
ఉమ్మడి కడప జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఈరోజు అంటే 18వ తేదీన తిరుపతి విమానాశ్రయం నుంచి రైల్వేకోడూరు చేరుకొని అక్కడ జనసేన శ్రేణులు, నాయకులతో సమావేశంలో పాల్గొంటారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు ఈ రెండు రోజుల పర్యటనను వాడుకోనున్నారు నాదెండ్ల. 


విజయవాడ లో బీజేపీ ప్రెస్ మీట్ -జీవీఎల్ నరసింహ రావు 


బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు మీడియా తో మాట్లాడనున్నారు.


ఇస్రో నుంచి తొలి కమర్షియల్ శాటిలైట్ ప్రయోగం 


భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ఇప్పుడు సరికొత్త మార్పులకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే ప్రైవేటు రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం సరిగ్గా ఉదయం 11 : 30 గంటలకు శ్రీహరికోటలోని సౌండింగ్ రాకెట్ ప్రయోగ 
వేదికపై నుంచి మొట్టమొదటి ప్రైవేటు రాకెట్ విక్రమ్-Sను ఇస్రో ప్రయోగించనుంది. హైదరాబాద్‌కు చెందిన స్కై రూట్ ఏరో స్పేస్ సంస్థ ఈ రాకెట్ రూపొందించింది. భారత్ నుంచి ప్రయోగించే మొదటి ప్రైవేటు రాకెట్ ఇదే కావడంతో దీనికి ప్రారంభ అని నామకరణం చేశారు. ఈ ప్రయోగ సన్నాహాలను ఇస్రో చైర్మన్ సోమనాథ్‌ పర్యవేక్షిస్తున్నారు. 6 మీటర్లు పొడవు ,545 కిలోల బరువు గల ఈ రాకెట్ 81.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణిస్తుంది. అక్కడ నుంచి తిరిగి సముద్రంలో శ్రీహరికోటకు 115.8 కిలోమీటర్ల దూరంలో పడిపోవడం జరుగుతుంది. ఈ ప్రయోగం 4 నిమిషాల 50 పూర్తి అయ్యే విధంగా ఇస్రో సన్నాహాలు సిద్ధం చేయడం జరిగింది.