నయా జోష్‌


ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మధ్యాహ్నం ఒంటిగంట ఐదు నిమిషాలకు ప్రారంభిస్తారు. అంతకు ముందు మధ్యాహ్నం 12:30 గంటలకు యాగశాల, సుదర్శనపూజ, హోమం, వాస్తుపూజల్లో పాల్గొననున్నారు. కార్యాలయం ప్రారంభమైన తర్వాత ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన తన ఆఫీస్‌లో తొలి సమావేశం నిర్వహిస్తారు. ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలు పాల్గొంటారు. 


హైదరాబాద్‌లో దమ్ము చూపేదెవరు?


ఐపీఎల్ 2023లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఎస్ఆర్‌హెచ్‌ సొంత మైదానం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇక్కడ కూడా ఈ సీజన్లో 200+ స్కోరు సాధించగా, 144 స్కోరును కూడా కాపాడుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేటి మ్యాచ్ లో పిచ్ మూడ్ లో అనిశ్చితి ఉంటుందని, అయితే ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు చాలా వరకు ఉపయోగపడుతుందని స్పష్టమవుతోంది.


హైదరాబాద్‌లో వర్షం కురిసిన సందర్భంగా పిచ్ ను ఎక్కువ సమయం కవర్లతో కప్పి ఉంచారు. దీనివల్ల పిచ్ పై తేమ ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లు ఈ తేమను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లకు మంచి అవకాశం ఇస్తోంది. ఈ సీజన్‌లో స్పిన్నర్లు కూడా ఇక్కడ సమర్థవంతంగా రాణించారు. ఇక్కడ ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్ బౌలర్లు మరింత గట్టిగా బౌలింగ్ చేశారు. ఐపీఎల్ 2023లో స్పిన్నర్లు 19.3 స్ట్రైక్ రేట్, 7.70 ఎకానమీ రేట్ కలిగి ఉండగా, ఫాస్ట్ బౌలర్లు 8.18 ఎకానమీతో పరుగులు చేసి 19.7 స్ట్రైక్ రేట్‌తో వికెట్లు తీశారు. గత మూడు మ్యాచుల్లో ఇక్కడ రెండు ఇన్నింగ్స్ ల్లో బౌలర్లదే ఆధిపత్యం.


హైదరాబాద్ లో టాస్ పాత్ర కూడా కీలకం కానుంది. వాస్తవానికి ఈ సీజన్లో ఈ మైదానంలో జరిగిన నాలుగు మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు మూడు మ్యాచ్‌లలో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసే సమయంలో జట్టు 150+ స్కోరు చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: HDFC, అదానీ ఎంటర్‌ప్రైజెస్, డాబర్, టాటా పవర్, TVS, హీరో. వీటిపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.




 



టైటన్: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 734 కోట్ల స్వంతంత్ర నికర లాభాన్ని నమోదు చేసింది, గత ఏడాది కాలంతో పోలిస్తే ఇది 49% వృద్ధి. కార్యకలాపాల ఆదాయం 33% పెరిగి రూ. 9,704 కోట్లకు చేరుకుంది.


సూల వైన్‌యార్డ్స్‌: నాలుగో త్రైమాసికంలో రూ. 14.2 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నివేదించింది, గత ఏడాది ఇదే కాలంలోని లాభం కంటే ఇది 5% ఎక్కువ. కార్యకలాపాల ఆదాయం ఏడాది ప్రాతిపదికన 7% పెరిగి రూ. 120 కోట్లకు చేరుకుంది.


గోద్రెజ్ ప్రాపర్టీస్: Q4లో రూ. 412 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఈ కాలంలో కార్యకలాపాల ఆదాయం 23% పెరిగి రూ. 1,646 కోట్లకు చేరుకుంది.


హావెల్స్ ఇండియా: జనవరి-మార్చి కాలానికి హావెల్స్ ఇండియా నికర లాభం స్వల్పంగా 2% పెరిగి రూ. 362 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో కార్యకలాపాల ఆదాయం 10% పెరిగి రూ. 4,850 కోట్లకు చేరుకుంది.


టాటా కెమికల్స్‌: మార్చి త్రైమాసికంలో టాటా కెమికల్స్ ఏకీకృత నికర లాభం 53% పెరిగి రూ. 711 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం 27% పెరిగి రూ. 4,407 కోట్లకు చేరుకుంది.


కోల్టే-పాటిల్ డెవలపర్స్: కోల్టే-పాటిల్ డెవలపర్స్‌లోని తన వాటాను PGIM మ్యూచువల్ ఫండ్ విక్రయించగా, సొసైటీ జనరల్ బల్క్ డీల్స్ ద్వారా కొన్ని షేర్లను కొనుగోలు చేసింది.


ABB ఇండియా: మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 245 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, కార్యకలాపాల ద్వారా రూ. 2,411 కోట్ల ఆదాయం వచ్చింది.


GR ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్: 737 కోట్ల విలువైన రోడ్డు రవాణా టెండర్‌కు జీఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ అత్యల్ప బిడ్డర్‌గా నిలిచింది.


చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 855 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, అదే సమయంలో నికర వడ్డీ ఆదాయం రూ. 2,006 కోట్లుగా ఉంది.


పెట్రోనెట్ LNG: నాలుగో త్రైమాసికంలో రూ. 614 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ. 13,873 కోట్ల ఆదాయం వచ్చింది.