నేడు విజయవాడ రానున్న రజినీకాంత్
ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలు విజయవాడ సమీపంలోని తాడిగడపలో జరగనున్నాయి. దీనికి సూపర్ స్టార్ రజనీ కాంత్, ఎమ్మెల్యే బాలకృష్ణ సహా టీడీపీ నేతలు హాజరుకానున్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి సభ, ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ నేతృత్వంలో ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, ఎన్టీఆర్ అసెంబ్లీ ప్రసంగాలు, పుస్తకావిష్కరణ జరుగనుంది. తాడిగడప‌లో వంద అడుగుల రోడ్‌లో విస్తృత ఏర్పాట్లు చేశారు. 


అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై నేడూ విచారణ 
వైఎస్ వివేకా హత్య కేసులో ముందస్తు  బెయిల్ ఇవ్వాలంటూ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ హైకోర్టు నేటికి వాయిదా వేసింది. అరెస్ట్ చేయవద్దని కావాలంటే  కస్టోడీయల్  ఇంటరాగేషన్ చేసుకోవచ్చునని అవినాష్ రెడ్డి తరపు లాయర్ నిరంజన్ రెడ్డి న్యాయమూర్తిని కోరారు. సుప్రీం కోర్టు గతంలో ఇలాంటి ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇలాంటి ఆదేశాలు ఇస్తే మేము తప్పకుండా పాటీస్తామన్నారు. అవినాష్‌పై ఎలాంటి కేసులు లేవని ఆయన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వివేకా హత్య కేసులో సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని సునీత తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇంటిని క్లీన్ చేసిన మహిళ స్టేట్ మెంట్  విషయంలో ఇప్పటికే ఆమెను ప్రభావితం చేశారన్నారు. అవినాష్ పై ఎలాంటి కేసులు లేవని అబద్దం చెప్పారని.. ఎన్నికల అఫిడవిట్  ప్రకారం నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఇంకా విచారించాల్సినది ఇంకా ఉందని భావించిన హైకోర్టు శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది.


నల్లగొండలో నిరుద్యోగ నిరసన ప్రదర్శన 
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలో విద్యార్థి నిరుద్యో ప్రదర్శన జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు నల్లగొండ మహాత్మాగాంది యూనివర్శిటీలో విద్యార్థులతో తెలంగాణ పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. అనంతరం విద్యార్థులతో ప్రదర్శన చేస్తారు. చేతిలో చిప్పలు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపడతారు. నల్లగొండ బైపాస్‌ నుంచి నల్లగొండ పట్నం వరకు సమారు మూడు కిలోమీటర్ల మేర ఈ ప్రదర్శన ఉంటుంది. తర్వాత గడియారం సెంటర్‌లో సభ నిర్వహిస్తారు. 


ఇవాళ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవుతున్నారు. ఉదయం 11 గంటలకు ఈ భేటీ ప్రారంభంకానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరగనుంది. స్పందనలో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు తీరుపై వారితో చర్చించనున్నారు. 


ఏపీ జేఏసీ అమరావతి సమావేశం 
ఉద్యోగుల సమస్యల పరిష్కారం, నిన్న మంత్రివర్గ ఉపసంఘం భేటీలో చర్చించిన అంశాలపై మాట్లాడుకోవడానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఏపీ జేఏసీ అమరావతి సమావేశం కానుంది. ఈ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి ఏపీ జేఏసీ నేతలు, ట్రేడ్ యూనియన్‌ల నేతలు హాజరుకానున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ట్రేడ్ యూనియన్‌లతో కలిపి ఆందోళనకు సిద్ధమవుతున్న వేళ ఈ రౌండ్‌ టేబుల్ సమావేశం మరింత ఆసక్తిని పెంచుతోంది. 


నేడు ఒంటిమిట్టకు గవర్నర్ 
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇవాళ ఒంటిమిట్టను సందర్శించనున్నారు. తిరుపతి నుంచి కడప విమానాశ్రయానికి హెలికాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 3.30కి ఒంటిమిట్ట వస్తారు. కాసేపు విశ్రాంతి తీసుకొనిఒంటిమిట్టను సందర్శిస్తారు. అక్కడ నుంచి నేరుగా అమీన్‌ పీర్‌ దర్గా చేరుకొని ప్రార్థనలు చేస్తారు. అనంతరం బయల్దేరి అమరావతి చేరుకుంటారు. 


రాహులో రాహులా ఆగము చేయకురో


ఐపీఎల్‌ 2023లో ఇవాళ 38వ మ్యాచ్‌ జరుగుతోంది. మొహాలి వేదికగా పంజాబ్‌ కింగ్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ (PBKS vs LSG) తలపడుతున్నాయి. ఈ రెండు జట్లకు ఇది రెండో పోరు! ఇందులో గెలిచిన వాళ్లు పది పాయింట్లతో పట్టికలో మరింత ముందుకెళ్తారు!


గబ్బర్‌.. ఫిట్‌!!


గతంతో పోలిస్తే పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings)  మంచి పోరాట పటిమ కనబరుస్తోంది. ఆఖరి వరకు విజయం కోసం పట్టుదలగా ఆడుతోంది. మూమెంటమ్‌ను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. కెప్టెన్ శిఖర్‌ ధావన్‌ (Shikar Dhaawan) గాయంతో డగౌట్లో కూర్చుంటున్నా.. సామ్‌ కరన్‌ (Sam Curran) అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఓపెనింగ్‌ పరంగా ఇప్పటికీ ఇబ్బందులున్నాయి. లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ రావడంతో బ్యాటింగ్‌ డెప్త్‌ పెరిగింది. మాథ్యూ షార్ట్‌ అటాకింగ్‌ మోడ్‌లో ఉంటున్నాడు. జితేశ్‌ శర్మ, షారుక్ ఖాన్‌ ఫర్వాలేదు. యువ పేసర్‌ అర్షదీప్‌ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ముంబయి ఇండియన్స్‌ మ్యాచులో బ్యాటర్లను వణికించాడు. అతడి బంతులకు వికెట్లే విరిగిపోయాయి. కరన్‌, నేథన్‌ ఇల్లిస్‌ పేస్‌ ఫర్వాలేదు. రాహుల్‌ చాహర్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌ స్పిన్‌తో ఆకట్టుకుంటున్నారు. కాంబినేషన్‌ సెట్‌ కాకపోవడంతో రబాడకు చోటు దొరకడం లేదు.


రాహుల్‌.. మారాలి!


లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants) గెలుపు అవకాశాలను చేజేతులా వదులుకుంటోంది. మ్యాచ్‌ మొత్తం పట్టుబిగించి కొద్దిలో సడలిస్తోంది. ప్రత్యర్థులకు అవకాశం ఇస్తోంది. దీన్నుంచి వేగంగా బయటపడాలి. ఇక ఛేదనలో మరింత దూకుడుగా ఉండాలి. భీకరమైన బ్యాటింగ్‌ లైనప్‌ పెట్టుకొని టార్గెట్లను ఛేజ్‌ చేసేందుకు ఇబ్బంది పడుతోంది. కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) ఫామ్‌లోకి వచ్చాడు. స్లో పిచ్‌లపై అదరగొడుతున్నాడు. అయితే మిగతా వికెట్లపై అటాకింగ్‌ మోడ్‌ అవసరం. కైల్ మేయర్స్‌ ప్లేస్‌లో డికాక్‌కు ఛాన్స్‌ ఇస్తారేమో చూడాలి. దీపక్‌ హుడా, కృనాల్‌ పాండ్య, ఆయుష్‌ బదోనీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. స్టాయినిస్, పూరన్‌ ఎప్పటికీ డేంజరే. లక్నో బౌలింగ్‌ మాత్రం అద్భుతం! మార్క్‌వుడ్‌కు రెస్ట్‌ ఇచ్చినా.. నవీనుల్‌ హఖ్‌ అదరగొడుతున్నాడు. యుధ్‌వీర్‌ బాగున్నాడు. అవేశ్‌ ఖాన్‌ గురించి తెలిసిందే. స్టాయినిస్‌ మీడియం పేస్‌తో వికెట్లు తీస్తున్నాడు. బిష్ణోయ్‌ కాస్త జాగ్రత్తగా ఉండాలి. అమిత్‌ మిశ్రా లేటు వయసులోనూ సత్తా చాటుతున్నాడు.