Top Headlines Today: 


నేడు శరత్‌బాబు అంత్యక్రియలు


సీనియర్ నటుడు శరత్‌బాబు అంత్యక్రియలు ఇవాళ చెన్నైలో జరగనున్నాయి. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్‌ ఛాంబర్‌కు తరలించారు. అక్కడ సినీ ప్రముఖులు నివాళి అర్పించారు. అనంతరం ఆ పార్థివదేశాన్ని రాత్రి ఏడు గంటలకు చెన్నైకు తరలించారు. అక్కడ తమిళ సినీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.


సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్ 


వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు రానుంది. తన ముందస్తు బెయిల్ పిటిషన్ వెకేషన్ బెంచ్ విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. తన తల్లి అనారోగ్యం కారణంగా సీబీఐ విచారణకు వెళ్లలేనని వారం పాటు మినహాయింపు ఇవ్వాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు. తన పిటిషన్ హైకోర్టు విచారణకు వచ్చే వరకు అంటే ఆరో తేదీ వరకు మినహాయింపు ఇవ్వండి లేదంటే తన పిటిషన్‌ వెకేషన్ బెంచ్ విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 


నేటి నుంచి 2వేల రూపాయల నోట్ మార్పిడి


2000 రూపాయల మార్పిడీ ఇవాళ్టి నుంచి ప్రారంభంకానుంది. ఈ నోట్‌ను చెలామణి నుంచి తప్పిస్తున్నట్టు శుక్రవారం ఆర్బీఐ ప్రకటించింది. నోట్ల మార్పిడికి హడావుడి అవసరం లేదన్నారు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. రెండు వేల రూపాయల నోట్‌ మార్పిడీ, డిపాజిట్ చేసేందుగు గడువు సెప్టెంబర్‌ 30 వరకు ఉందని గుర్తు చేశారు. 


నేడు తొలి క్యాలిఫయర్ మ్యాచ్


ఐపీఎల్‌లో నేటి నుంచి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు స్టార్ట్ కానున్నాయి. ఫ్లేఆఫ్స్‌కు వచ్చిన నాలుగు జట్లలో నేడు రెండు జట్ల మధ్య పోరు జరగనుంది. తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. చెన్నైపై ఇంత వరకు ఓటమి లేకపోవడం గుజరాత్‌ జట్టుకు బూస్ట్‌లో పని చేస్తోంది. సొంత గడ్డ కావడం చెన్నైకు కలిసి వచ్చే అంశం. ఈ పరిస్థితిలో సమ ఉజ్జీల మధ్య ఆసక్తి పోరు ఖాయంగా కనిపిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


BPCL: క్రూడ్‌ ఆయిల్‌ రిఫైనింగ్ మేజర్ BPCL లిమిటెడ్, 2023 మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో ఏకీకృత నికర లాభంలో 168% వృద్ధిని నమోదు చేసి రూ. 6,780 కోట్లకు చేరుకుంది. రిపోర్టింగ్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 8% పెరిగి రూ. 1.33 లక్షల కోట్లకు చేరుకుంది.









PB ఫిన్‌టెక్: పాలసీబజార్ మాతృ సంస్థ PB ఫిన్‌టెక్, 2022-23 నాలుగో త్రైమాసికంలో నష్టాలను భారీగా తగ్గించి రూ. 8.9 కోట్లకు పరిమితం చేసింది. జనవరి-మార్చి కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన 61% పెరిగి రూ. 869 కోట్లకు చేరుకుంది.


గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్: 2023 జనవరి-మార్చి కాల త్రైమాసికంలో గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ రూ. 71 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఆ త్రైమాసికంలో కంపెనీ రూ. 1,138 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.


ITI: 4G రోల్ అవుట్ కోసం BSNL నుంచి రూ. 3,889 కోట్ల విలువైన ముందస్తు ఆర్డర్‌ను ITI దక్కించుకుంది.


స్పెన్సర్: Q4FY23లో స్పెన్సర్ రూ. 61 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ. 543 కోట్లుగా ఉంది.


JSW స్టీల్: నేషనల్ స్టీల్ అండ్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించి, JSW స్టీల్‌కు చెందిన JSW స్టీల్ కోటెడ్ ప్రొడక్ట్స్ (JSW Steel Coated Products) రిజల్యూషన్ ప్లాన్‌ను NCLT ఆమోదించింది.


ధనలక్ష్మి బ్యాంక్: 2023 మార్చితో ముగిసిన మూడు నెలలకు ధనలక్ష్మి బ్యాంక్ రూ. 38 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఆ త్రైమాసికంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (NII) రూ. 115 కోట్లుగా ఉంది.


శ్రీ సిమెంట్: నాలుగో త్రైమాసికంలో శ్రీ సిమెంట్ రూ.546 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అదే సమయంలో కార్యకలాపాల ద్వారా రూ. 4,785 కోట్ల ఆదాయం వచ్చింది.


ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్: ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నికర లాభం Q4FY23లో 14% పెరిగి రూ. 262 కోట్లకు చేరుకుంది. సమీక్ష కాల త్రైమాసికంలో NII 13% పెరిగి రూ. 734 కోట్లకు చేరుకుంది.