Top-10 Selling Two-Wheelers In India: భారతదేశంలో, ఫోర్-వీలర్ మార్కెట్ కంటే టూ-వీలర్ మార్కెట్ చాలా పెద్దది. బైక్/స్కూటర్ ఉన్న వాళ్లు కార్ కొనలేరేమోగానీ, కారు ఉన్న వాళ్లు కచ్చితంగా ఒక బైక్/స్కూటర్ కొంటారు. గత నెల, అంటే జూన్ 2025లో, హీరో స్ల్పెండర్ బైక్ సేల్స్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ బైక్, అత్యధికంగా అమ్ముడైన బైక్‌లలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.
నంబర్ 1 - హీరో స్ల్పెండర్
జూన్ 2025లో (ఒక్క నెలలో) హీరో స్ల్పెండర్ మొత్తం 3,31,057 యూనిట్ల మోటార్ సైకిళ్లను విక్రయించింది, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 8.34 శాతం వార్షిక పెరుగుదల. జూన్ 2024లో అమ్మకాల సంఖ్య 3,05,586 లక్షలకు దగ్గరగా ఉంది. హీరో స్ల్పెండర్ కాకుండా ఏ ద్విచక్ర వాహనాలు బాగా అమ్ముడయ్యాయో తెలుసుకుందాం.
ఎక్స్-షోరూమ్ ధర: ₹74,046 (బేస్ వేరియంట్) onwards
స్పెక్స్: 97.2 cc, 8 PS పవర్, 70 kmpl మైలేజ్
టాప్-5లో ఉన్న టూవీలర్లు
ఈ జాబితాలో, హోండా యాక్టివా రెండో స్థానంలో ఉంది, ఇది మొత్తం 1,83,265 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. అయితే, సంవత్సరం ప్రాతిపదికన 21.47% తగ్గుదల నమోదైంది.
ధర: ₹81,045–95,567 (Activa 6G)
స్పెక్స్: 109.51 cc, 7.88 bhp పవర్, 59.5 kmpl మైలేజ్, 106 kg బరువు, CBS బ్రేక్స్
హోండా షైన్, అమ్మకాల జాబితాలో థర్డ్ ప్లేస్‌లోకి వచ్చింది హోండా షైన్ మొత్తం 1,43,218 యూనిట్లను సేల్ చేసింది.
ఎక్స్-షోరూమ్ ధర: ₹80,250 నుంచి ప్రారంభం
స్పెక్స్: 125cc సింగిల్ సిలిండర్, 7.38 PS పవర్, 55 kmpl మైలేజ్
టీవీఎస్ జూపిటర్, సేల్స్ రిపోర్ట్‌లో ఫోర్త్ ర్యాంక్‌లో కనిపించింది. గత నెలలో, జూపిటర్ 1,07,980 స్కూటర్లను విక్రయించింది.
ఎక్స్-షోరూమ్ ధర: ₹78,631–91,781
స్పెక్స్: 113cc, 48 kmpl మైలేజ్,
హీరో HF డీలక్స్ 12.16 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 1,00,878 యూనిట్ల మోటార్ సైకిళ్ల అమ్మకాలతో ఐదో స్థానంలో ఉంది.
ఎక్స్-షోరూమ్ ధర: ₹59,998 నుంచి ప్రారంభం
స్పెక్స్: 97.2cc, 9.6 L ట్యాంక్, కమ్యూటర్ మోడల్
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టాప్-5లో ఉన్న అన్ని టూవీలర్లు జూన్ 2025లో లక్ష కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించాయి.
టాప్-6 నుంచి 10 వరకు ఉన్న టూవీలర్లు
బజాజ్ పల్సర్ ఆరో స్థానంలో ఉంది & గత నెలలో మొత్తం 88,452 యూనిట్లను సేల్ చేసింది. ఇది, వార్షికంగా 20.39 శాతం తగ్గింది.
ఎక్స్-షోరూమ్ ధర: ₹1.50 లక్షల నుంచి ప్రారంభం (Pulsar 150 బేస్ మోడల్)
స్పెక్స్: పల్సర్ 150 5-స్పీడ్, 8PS పవర్, 60 kmpl మైలేజ్
సుజుకి యాక్సెస్ ఏడో స్థానంలో ఉంది. సమీక్ష కాలంలో, యాక్సెస్ 1.22 శాతం వార్షిక క్షీణతతో 51,555 యూనిట్లను అమ్మింది.
ఎక్స్-షోరూమ్ ధర: ₹83,800 నుంచి ప్రారంభం
స్పెక్స్: 124 cc, 45 kmpl మైలేజ్
బజాజ్ పల్సర్ ఏడో స్థానంలో ఉంది & గత నెలలో మొత్తం 88,452 యూనిట్లను సేల్ చేసింది. ఇది, వార్షికంగా 20.39 శాతం తగ్గింది.
ధర: ₹1.50 Lakh onwards (Pulsar 150 base)
స్పెక్స్: 150cc, 5-స్పీడ్, 8PS పవర్, 60 kmpl మైలేజ్
టీవీఎస్ అపాచీ ఈ జాబితాలో ఎయిత్ ప్లేస్‌లోకి వచ్చింది, ఇది 11.37 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 41,386 యూనిట్లను విక్రయించింది.
ఎక్స్-షోరూమ్ ధర: ₹1.18 లక్షల నుంచి ప్రారంభం
స్పెక్స్: 160 cc, 18 bhp పవర్, డిస్క్ బ్రేక్‌లు
TVS XL తొమ్మిదో స్థానంలో ఉంది, మొత్తం 33,349 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఎక్స్-షోరూమ్ ధర: ₹41,000 నుంచి ప్రారంభం
స్పెక్స్: 100 cc, యుటిలిటీ-ఫోకస్డ్ డిజైన్, 52 kg బరువు
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ పదో స్థానంలో ఉంది, మొత్తం 29,172 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఎక్స్-షోరూమ్ ధర: ₹1.93 – 2.30 లక్షలు
స్పెక్స్: 349 cc సింగిల్-సిలిండర్, 20.2 bhp పవర్, 35 kmpl మైలేజ్, డూయల్-ఛానెల్ ABS, డిస్క్-డిస్క్ సెటప్.