Tomoto Price Memes : కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా టమాట మంట పెడుతోంది. ఏకంగా కొన్ని ప్రాంతాల్లో కిలో టమాట రూ.100 ధర పలుకుతోంది. సామాన్యులు కూరగాయలు కొనాలంటే జంకుతున్నారు. ప్రతి కూరలో అత్యవసరమైన టమాట అధిక ధర పలుకుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా అత్యధిక మార్కెట్లలో కిలో టమాట ధర రూ.100 పలుకుతోంది. కొన్ని మార్కెట్లలో రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. గత నెలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలతోపాటు దేశమంతటా కిలో టమాటా రూ.2-5 మధ్య పలికింది. ఇప్పుడు కిలో టమాటా ధర కేవలం నెల రోజుల్లో 1900 రెట్లు పెరిగింది. దిల్లీ మార్కెట్లలో కిలో టమోటా రూ.70-100 మధ్య విక్రయిస్తున్నారు. మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలో రూ.80-100 మధ్య ఉండగా, రాజస్థా్న్‌లో రూ.90 నుంచి రూ.110 మధ్య పలుకుతున్నాయి.
ఈ టమాట ధరపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఓ మార్కెట్‌లో యాపి ల్ రేటు.. టమాటా రేటు ఒకటే ఉండటం పై ఓ మీర్ చేసిన పోస్ట్ అందర్నీ ఆకట్టుకుంటోంది
పలు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా టమోటా తోటలు దెబ్బ తిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి వల్ల దిగుబడి తగ్గింది. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి టమోటాల సరఫరా గణనీయంగా తగ్గింది. గతంతో పోలిస్తే రైతులు టమోటా సాగు తగ్గించారని తెలుస్తున్నది. హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి టమోటా సరఫరా తగ్గిపోవడంతో వారంలో హోల్‌సేల్ మార్కెట్లలో ధరలు రెట్టింపయ్యాయి. రైతులు కూడా గిట్టుబాట ధర లభించక పోవడంతో టమోటా తోటల్లో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడటం లేదు. ఫలితంగా టమోటా తోటలపై చీడ పీడలు పెరిగిపోయి దిగుబడి తగ్గిపోవడం కూడా ధరల తగ్గుదలకు కారణం అని భావిస్తున్నారు. ఇటీవల వచ్చిన బైపర్జోయ్ తుపాన్ కూడా టమోటా దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడిందని కొందరు నిపుణులు చెప్పారు. ఈ తుఫాను వల్ల గుజరాత్, మహారాష్ట్రల్లో పంట దిగుబడి తగ్గిపోయిందని. గుజరాత్ రాష్ట్రంలో పంట దిగుబడిపై తుఫాన్ ప్రభావం ఫలితంగానే ధరలు పెరిగాయని అంటున్నారు.