Top 10 News Today:
విజయనగరం ఎమ్మెల్సీ -వైసీపీకే ఛాన్స్!
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హతా వేటు వేయడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది. ఈ విషయంపై రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చేసింది. వైసీపీ తరపున ఎవరు పోటీ చేసినా అది బొత్స కుటుంబం నుంచే ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
స్వపక్షంలో విపక్షం -పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్
పోలీసుల పనితీరుపై పిఠాపురంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. ఎందుకు పవన్ కల్యాణ్ ఇలా వ్యాఖ్యానించారో చాలా మందికి అర్థం కాలేదు. కానీ రాజకీయ పరమైన కారణాల ప్రకారం చూస్తే పవన్ వ్యూహాత్మకంగానే ఇలా మాట్లాడారని అనిపిస్తోంది.. ప్రతిపక్షం లేదు అన్న భావన రాకుండా చేయడానికి ఆయన అలా మాట్లాడారని భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
వైఎస్ విజయమ్మ మరో బహిరంగ లేఖ
వైఎస్ విజయమ్మ తనకు జరిగిన కారు ప్రమాదంపై బహిరంగ లేఖ రాశారు. ఈ విషయంలో జగన్ పేరు తీసుకు రావడంపై ఆామె కీలక వ్యాఖ్యలు చేశారు. అసత్య ప్రచారాలతో తనకు మానసిక వేదన కలుగుతోందన్నారు. వాటిని ఖండించకపోతే ప్రజలు నిజం అనుకునే ప్రమాదం ఉందన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
విద్యార్థులకు సీఎం రేవంత్ సూచనలు
రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దని యువతకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మంచిర్యాల జిల్లా సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. యువత విద్యను నిర్లక్ష్యం చేయొద్దని సీఎం రేవంత్ సూచించారు. గంజాయి, డ్రగ్స్ అన్నింటికంటే పెద్ద ప్రమాదకరమని.. అలాంటి వ్యసనాల బారిన పడొద్దని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కులగణనపై తెలంగాణ సీఏం ప్రత్యేక శ్రద్ద
కులగణనను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ప్రయత్నాలు చేస్తున్నారు. చట్టపరంగా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీలు ఎంత మంది ఉన్నారో లెక్కించి వారికి జనాభా దామాషా పద్దతిలో అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కులగణన చేపడుతున్నట్లుగా చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
స్కూల్ గేట్ మీద పడి విద్యార్థి మృతి
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో సోమవారం సాయంత్రం పాఠశాల గేట్ మీద పడి ఒకటో తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలింగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఆంధ్రలో నూతన స్పోర్ట్స్ పాలసీ
ఏపీ ప్రభుత్వం క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలో స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు 4 లక్ష్యాలతో ఈ విధానం రూపొందించినట్లు సీఎం చెప్పారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
టికెట్ చార్జీల పెంపు దుష్ప్రచారమన్న టీజీఎస్ఆర్టీసీ
టీజీఎస్ఆర్టీసీ బస్సు టికెట్ ధరలను పెంచిందని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రెగ్యులర్ సర్వీస్‌లకు సాధారణ చార్జీలే అమల్లో ఉన్నాయని, దీపావళి సమయంలో తిరుగు ప్రయాణ రద్దీలో ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఛార్జీలు సవరించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు