కాంగ్రెస్‌ పార్టీలో చేరిన షర్మిల


వైఎస్‌ఆర్టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లో (Congress) చేరారు. ఢిల్లీ (Delhi)లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన షర్మిల... వైఎస్సాఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.. షర్మిల వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ.. షర్మిలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంకా చదవండి


కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ చర్చలు


ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని నివాసంలో కేసీఆర్ ను పరామర్శించారు. తర్వాత దాదాపుగా 40 నిమిషాల పాటు ఇరువురు రాజకీయ అంశాలపై చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నేతలు ఎవరూ లేకుండా వారిద్దరే పలు అంశాలపై మాట్లాడుకున్నారని తెలుస్తోంది. కేసీఆర్, జగన్ మధ్య మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఉద్యమం సమయంలో జగన్ సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచిన సమయంలో రెండు పార్టీల మధ్య వివాదం ఏర్పడింది. జగన్ పరకాల పర్యటనకు వెళ్లిన సమయంలో రైల్వే స్టేషన్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితి మారిపోయింది. ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు.. తెలంగాణలోనూ ఆయన రాజకీయాలు చేస్తూండటంతో.. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా  కేసీఆర్, జగన్ రాజకీయ స్నేహితులు అయ్యారు. ఇంకా చదవండి


తల్లి, చెల్లికి నిరాదరణ - వేరే పార్టీలపై ఏడుపు - జగన్‌పై టీడీపీ ఆగ్రహం!


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు టీడీపీ (Tdp ) సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు (Kala Venkatrao) కౌంటర్ ఇచ్చారు. నీ కుటుంబాన్ని వేరే వాళ్లు చీల్చారని నీ తల్లి విజయమ్మ (Vijayamma ), చెల్లి షర్మిల (Sharmila)తో చెప్పించగలవా ? అని సవాల్ చేశారు. నీ భార్య కుటుంబమే నీ కుటుంబం అన్నట్లుగా వ్యవహరిస్తున్నావని, రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశావంటూ మండిపడ్డారు. నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని, అక్రమంగా వేల కోట్లు సంపాదించావంటూ కళా వెంకట్రావు విమర్శించారు. ఇంకా చదవండి


వెనక్కి తగ్గని అంగన్‌వాడీ సిబ్బంది


మూడు వారాలుగా అంగన్వాడీ సిబ్బంది (Anganwadi Workers) వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. డిమాండ్లు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. కనీస వేతనం ఇచ్చే వరకు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ (Retirement Benifits) కల్పించే వరకు సమ్మె విరమించబోమని కార్మికులు, ఉద్యోగులు చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్లను ముట్టడించారు. రోజుకో విధంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఇంకా చదవండి


అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ చర్చలు సఫలం


రాష్ట్రంలో అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ (TSRTC) చర్చలు సఫలమయ్యాయి. బస్ భవన్ లో (BUS Bhawan) గురువారం సంస్థ ఎండీ సజ్జనార్ (Sajjanar) తో అద్దె బస్సుల యజమానులు సమావేశమై చర్చించారు. అద్దె బస్సు ఓనర్లు కొన్ని సమస్యలు తమ దృష్టికి తెచ్చారని సజ్జనార్ తెలిపారు. వారం రోజుల్లో వాళ్ల సమస్య పరిష్కారానికి ఓ కమిటీ వేస్తామని చెప్పారు. దీనిపై అద్దె బస్సుల యజమానులు సానుకూలంగా స్పందించారు. రేపటి నుంచి యాథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని, సంక్రాంతికి కూడా ఉచిత బస్సు సర్వీసులు ఉంటాయని.. స్పెషల్ బస్సులు నడుపుతామని సజ్జనార్ స్పష్టం చేశారు. ఇంకా చదవండి