'నన్ను అంతమొందించేందుకు కుట్ర' - ఏసీబీ న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ


స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా జడ్జికి లేఖ పంపారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ తన ఆవేదనను లేఖలో పేర్కొన్నారు. తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఈ నెల 25న 3 పేజీల లేఖను న్యాయమూర్తికి రాశారు. ఇంకా చదవండి


ఏ క్షణమైనా కాంగ్రెస్ రెండో జాబితా


రెండో జాబితాలో   45 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ఢిల్లీలో ప్రకటించారు.  మిగతా స్థానాలపై నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షులకు వదిలేశామన్నారు. కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని..  చెరో రెండు సీట్లు ఇచ్చే విషయంలో అంగీకారం కుదిరిందన్నారు.  ఏ స్థానాలు ఇవ్వాలి అన్న విషయంపై ఏకాభిప్రాయం రావాల్సి ఉందని..  ఒకటి రెండు రోజుల్లో పొత్తుల వ్యవహారం కొలిక్కి వస్తుందన్నారు.  సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట మిత్రపక్షలకు ఇచ్చే ప్రసక్తే లేదని మురళీధన్ స్పష్టం చేశారు. ఇంకా చదవండి


సామాన్యులకు షాక్ - ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు, అదే కారణమా?


మొన్నటి వరకూ టమాటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. ఏకంగా కిలో రూ.200కు చేరడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దేశవ్యాప్తంగా ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే టమాటా ధరలు తగ్గి సామాన్యులకు అందుబాటులోకి రాగా, ఇప్పుడు ఉల్లి సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఏపీలోని అన్ని మార్కెట్లలోనూ ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంకా చదవండి


బైనాక్యులర్స్ గుర్తు వద్దంటున్న షర్మిల - మరో గుర్తు కోసం ఈసికి విజ్ఞప్తి !


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న  వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఆ పార్టీకి బైనాక్యులర్‌ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ గుర్తుపై షర్మిల అసంతృప్తిగా ఉన్నారు.  మరో గుర్తు కేటాయించాలని ఆ పార్టీ చీఫ్ షర్మిల సీఈసీ ఆశ్రయించినట్లుగా తెలు్సతోంది. తమ తమ పార్టీ చాయిస్ గా  బాల్,  అగ్గిపెట్టె గుర్తులు ఖాళీగా  ఉండటంతో ఈ రెండు గుర్తులలో ఏదో ఒకటి తమ పార్టీకి కేటాయించాలని షర్మిల  సీఈసీని కోరారు.  బాల్ గుర్తుపై  వైఎస్ఆర్టీపీ  చీఫ్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తో్ంది.  కాగా అంతకుముందు నాగలి గుర్తు కోసం వైఎస్ఆర్టీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ధరఖాస్తు చేసుకుంది. కానీ ఈసీ బైనాక్యూలర్స్‌నుకేటాయించింది.    వైఎస్ఆర్టీపీ అభ్యర్థులకు ఈ గుర్తును కేటాయించాల్సిందిగా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సూచించింది. 2023 నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ 119 స్థానాల్లో పోటీ చేయనున్నట్లుగా షర్మిల ప్రకటించారు.  పాలేరు నుంచి షర్మిల బరిలో దిగనున్నారు. ఇంకా చదవండి


'రైతన్నా నీకు ఏది కావాలి? ఆలోచించుకో!' - మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్


తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు ఊపందుకున్నాయి. బహిరంగ సభలు, ప్రచారాలు సైతమే కాకుండా కీలక పార్టీల నేతలు సోషల్ మీడియాను సైతం తమ ప్రచారానికి విస్తృతంగా వాడుకుంటున్నారు. నిత్యం నెట్టింట యాక్టివ్ గా ఉంటూ అందరితోనూ మమేకమవుతారు మంత్రి కేటీఆర్. ఆయన తాజాగా, తెలంగాణ రైతులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, కర్ణాటక కాంగ్రెస్ అమలు చేస్తోన్న కార్యక్రమాలను బేరీజు వేస్తూ ఏది కావాలో ఎంచుకోవాలని సూచించారు. ఇంకా చదవండి