మీసాలు తిప్పడంపై బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక


టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. ముఖ్యంగా బాలకృష్ణ ప్రవర్తన అభ్యంతరంగా ఉందని స్పీకర్ అభిప్రాయపడ్డారు. ఆయన మీసాలు మెలేయడంతోపాటు తొడలు కొట్టారని అన్నారు. అయితే ఇవన్నీ ఆయన మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. వాయిదా తర్వాత శాసనస సభ ప్రారంభమైనప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులకు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలికారు. ఇలా తీవ్ర గందరగోళం మధ్య స్పీకర్‌ రూలింగ్  ఇచ్చారు. ఇంకా చదవండి


దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్


దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 15వ తేదీ నుంచి 29వ తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఆయా తేదీల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయమున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది. ఇంకా చదవండి


పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్


చిత్తూరు జిల్లా పుంగనూరు, అమగల్లు కేసుల్లో టీడీపీ నేతలు 79 మందికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. చిత్తూరు, మదనపల్లి, కడప జైళ్లలో ఇప్పటి వరకూ ఈ టీడీపీ నేతలంతా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డికి కూడా ఉపశమనం కలిగింది. మండలి సమావేశాలు జరుగుతుండటంతో ఆయనను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి మంగళవారం సంబంధిత పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన మరికొందరికి కూడా వూరట లభించింది. అంతకు ముందు హైకోర్ట్ ముందస్తు బెయిల్ ఇవ్వడంతో సీఐడీ సుప్రీంకోర్టు ను ఆశ్రయించిందని హైకోర్టు గుర్తు చేసింది. తదుపరి విచారణ వరకూ వీరిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ నేతల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఇంకా చదవండి


సినిమా కళాకారులను వైసీపీ ఎమ్మెల్యేలు అవమానించారు


అసెంబ్లీలో జరిగిన ఘటనలు తలుచుకుంటే బాధేస్తోందని, నియంతృత్వ ధోరణిలో శాసనసభను నడిపిస్తున్నారని హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. ప్రజల్లో చంద్రబాబు ఎంతో ఆత్మవిశ్వాసం నింపారని, ఆధారాలు లేని కేసులో జైలుకు పంపారని బాలయ్య వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదని పేర్కొన్నారు. తెలుగు సినిమా కళాకారులను వైసీపీ ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారని చెప్పారు. ఇంకా చదవండి


బస్సు యాత్రకు సిద్ధమైన కాంగ్రెస్- స్క్రీనింగ్ కమిటీలో యాష్కీ, కోమటిరెడ్డి


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా...కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అందుకోసం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశారు. పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల మొదటి వారం నుంచే యాత్రను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఎన్నికల ముందు జరుగుతున్న బస్సుయాత్రలో...పార్టీ కీలక నేతలంతా పాల్గొననున్నారు. ఇంకా చదవండి