Tirumala Laddu Prasadam adulteration issue : తిరుమల అంటే కోట్లాది మంది హిందువుల ఆధ్యాత్మిక రాజధాని. తిరుమల లడ్డూ దొరికితే చాలు శ్రీవారి ఇనుగ్రహం వారిపై ఉందనే భావం భక్తుల్లో ఉంటుంది. అలాంటి తిరుమల శ్రీవారి లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ప్రకటన చేయడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని చిన్న ఆలయాల నుండి పెద్ద ఆలయాల వరకు వినియోగిస్తున్న వస్తువుల్లో నాణ్యత ప్రమాణాలపై దృష్టి పెట్టారు ఆయా ఆలయాల అధికారులు.


అన్ని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు


తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన ఘటన కు ఆలయం లో పవిత్రోత్సవాలు జరిగాయి.. భక్తులు విన్న మాటలకు ప్రాయశ్చిత్తం గా పాప దోషం నివారణకు శాంతి హోమం, క్షమాపణ మంత్రం జపించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్ ఆలయాల్లో కూడా ఆయా ఆలయాల నియమావళి ప్రకారం ఆలయ శుద్ది చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఇది మంచిదే అని అంతా ఆలయాల్లో శుద్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


ప్రసాదాల సరకులు, న్యాణ్యతపై ప్రత్యేక పరిశీలన
 
తిరుమల శ్రీవారి ఆలయంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని దీనిపై చర్చ నడవంతో టీటీడీ ముందుగా అన్ని వస్తువుల నాణ్యత ప్రమాణాలు పాటించేలా.. వాటిని తనిఖీ చేయడానికి ల్యాబ్ లు సైతం ఏర్పాటు చేసింది. ఇది టీటీడీ ఆలయాలాకే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేందుకు దోహద పడింది.  ఇప్పుడు ఎక్కడ చూసిన తిరుమల శ్రీవారి ఆలయం గురించి కంటే ఆయా స్థానిక ఆలయాల్లో వినియోగించే నెయ్యి లో ఎలాంటి నాణ్యమైన వస్తువులు వాడుతున్నామనేది అనుమానం రేకెత్తించింది. దీంతో కొన్ని ప్రముఖ ఆలయాల పై కూడా ఈ ప్రభావం పడడంతో అక్కడ టెండర్ల ద్వారా వచ్చే వాటిని ఎక్కడి ల్యాబ్ లకి పంపి  తనిఖీ చేయాలని ఆలోచన చేస్తున్నారు. చాల ఆలయాల్లో నాసిరకం గా ఉన్న వాటినే ప్రసాదాలకు ఉపయోగిస్తున్నట్లు కూడా ప్రచారం నడుస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వం తిరుమలలో పాటు అన్ని ఆలయాల్లో ప్రక్షాళన చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
 
రూ.75 లక్షలతో  ల్యాబ్ ఏర్పాటు


తిరుమల శ్రీవారి ప్రసాదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అక్కడ చేసే రుచి, వినియోగించే సరుకులు.. వాటి నాణ్యత కు ఏ ఆలయం సాటి రాదు.. ఇదే కోవకు చెందిన ఆలయాల్లో వారు చేసిన ప్రసాదాలు ఇతరులు చేసే అవకాశం కూడా లేదు. అయితే మన రాష్ట్రంలో నాణ్యత ప్రమాణాలు పరీక్షలు చేసే ల్యాబ్ లు ఉన్నాయా లేదా అంటే లేవని అంటున్నారు.. అయితే తిరుమల లాంటి చోట ల్యాబ్ ఏర్పాటు కు రూ.75 లక్షలు అయితే మరి ఇటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కొన్ని ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని.. వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని ప్రజలు కోరుతున్నారు. టీటీడీ కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.