Uddhav Thackeray Fires on Shinde: 


శిందేపై ఫైర్..


మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే...ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ శిందేపై ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీపైనా విరుచుకుపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరుని, గుర్తుని శిందే వర్గానికి ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. తమ పార్టీ పేరుని దొంగిలించారంటూ మండి పడ్డారు. 


"మా పార్టీ గుర్తుని దొంగిలించారు. ఆ దొంగలకు తగిన బుద్ధి చెప్పాలి. ఆ దొంగ ఎవరో అందరికీ తెలుసు. ఇప్పటికే పట్టుబడ్డాడు కూడా. నేనా దొంగకు సవాల్ విసురుతున్నాను. బాణం విల్లుతో వచ్చి ఎదురు నిలబడితే...కాగడాలతో బదులు చెబుతాం. వాళ్లకు కావాల్సింది శివసేన కుటుంబం కాదు. కేవలం బాలాసాహెబ్‌ థాక్రే పేరు మాత్రమే.  ఆ పార్టీ గుర్తు ఉంటే చాలు. ప్రధాని నరేంద్ర మోదీ బాలాసాహెబ్ మాస్క్‌ వేసుకోవాలని చూస్తున్నారు. మహారాష్ట్రకు రావడానికి అదో మార్గం అని భావిస్తున్నారు. ఏది నిజమైన ముఖమో, ఏది కాదో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు" 


-ఉద్దవ్ థాక్రే, మహారాష్ట్ర మాజీ సీఎం