తమిళనాడులో సీఎం స్టాలిన్ పాలనా విధానానికి మంచి పబ్లిసిటీ వస్తోంది . ఆయన కక్ష సాధింపులకు దూరంగా ఉన్నారని ఇతర రాష్ట్రాల్లో ప్రశంసలు వస్తున్నాయి. దీనికి కారణం జయలలిత పేరు మీద ఉన్న అమ్మ క్యాంటీన్లు కొనసాగించడం, అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను.. అభివృద్ధి పనులను కొనసాగించడం. అయితే ఇప్పుడు కక్ష సాధింపులకు దిగుతున్నారని అన్నాడీఎంకే నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల అన్నాడీఎంకే మాజీ మంత్రులపై దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికి నలుగురు మాజీ మంత్రులపై కేసులు నమోదు చేశారు. తాజాగా మరో మంత్రిపై దాడులు చేయడంతో అన్నాడీఏంకే నేతలు విరుచుకుపడుతున్నారు. 


Also Read: షీనా బోరా బతికే ఉందట.. ఏళ్ల తర్వాత ట్విస్ట్ ఇస్తున్న ఇంద్రాణి !


తమిళనాడులో డైరక్టరేట్ ఆఫ్ విజినెల్స్ అండ్ యాంటీ కరప్షన్ పేరుతో ప్రత్యేక దర్యాప్తు విభాగం ఉంది.  ఈ దర్యాప్తు సంస్థ కొద్ది రోజులుగా అన్నాడీఎంకే నేతలపై దృష్టి పెట్టింది. వరుసగా సోదాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రులపై దృష్టి పెట్టారు. మొదట మాజీ రవాణా మంత్రి  ఎంఆర్‌ విజయ భాస్కర్‌ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు  చేశారు.  తర్వాత  రిజస్ట్రేషన్ల శాఖ మాజీ  మంత్రి వీరమణి, తర్వాత నగరాభివృద్ధి శాఖ నిర్వహించిన  వేలుమణి  ఇళ్లలో సోదాలు నిర్వహించారు. తాజాగా   విద్యుత్‌శాఖ మాజీ మంత్రి తంగమణి ఇంట్లో సోదాలు నిర్వహించి  ఆదాయానికి మించి ఆస్తు లు గడించినట్టు  కేసు నమోదు చేసింది.  


Also Read: ఓఆర్ఆర్ వద్ద ఇద్దరు యువకులు, యువతి.. ముగ్గురూ కలిసి కారులో.. అడ్డంగా బుక్


అన్నాడీఎంకే నేత తంగమణి కుటుంబసభ్యులకు ఆంధ్రాలో కూడా వ్యాపారాలు ఉన్నాయి. ఏపీలోనూ వారి వ్యాపారాలపై తమిళనాడు డీవీఏసీ అధికారులుసోదాలు నిర్వహించారు.   పలు ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, బినామీ సంస్థలు, పలు చోట్ల పెట్టుబడులే కాకుండా క్రిష్టోకరెన్సీలోనూ పెట్టుబడులు పెట్టినట్టుగాక చెబుతున్నారు. అయితే ఈ సోదాలన్నీ కక్ష సాధింపులేనని అన్నాడీఎంకే ఆరోపిస్తోంది.  ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఎన్నికల వాగ్దానాల్ని విస్మరించిందని, వీటిని కప్పిపుచ్చుకునేందుకు తమ పార్టీ వర్గాల మీద దాడులకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు.


Also Read: 'ఆ కేంద్ర మంత్రి ఓ క్రిమినల్..' విపక్షాల నిరసనలతో దద్దరిల్లిన పార్లమెంటు


తాము అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడిన అన్నాడీఎంకే నేతల్ని జైలుకు పంపిస్తామని డీఎంకే ఎన్నికల ప్రచారంలో చెప్పింది. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు అవినీతికి పాల్పడినట్లుగా ఆధారాలున్న వారిపై విరుచుకుపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇవి కక్ష సాధింపుగా ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. తాము అధికారంలో లేని పదేళ్ల కాలంలో ఎంతో మంది డీఎంకే నేతల్ని అరెస్ట్ చేశారని.. అది కక్ష సాధింపు అయితే.. ఇప్పుడు కూడా అలాగే అనుకోవాలని అన్నాడీఎంకే నేతలకు డీఎంకే నేతలు కౌంటర్ ఇస్తున్నారు. 


Also Read: Central Cabinet: అమ్మాయి పెళ్లి వయసు 18 కాదు 21 ఏళ్లు.. త్వరలోనే పార్లమెంట్‌లో చట్టం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి