కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటులో డిమాండ్ చేశారు. లఖింపుర్ ఖేరీ ఘటనలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాని నిందితుడిగా ఉన్నాడని రాహుల్ గాంధీ మరోసారి గుర్తు చేశారు. విపక్షాలు కూడా అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందేనని పట్టుపడ్డటంతో ఉభయ సభలు దద్దరిల్లాయి.
ఉభయ సభలు వాయిదా..
లఖింపుర్ ఖేరీ ఘటనపై చర్చ జరగాల్సిందేనని లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఉభయసభల్లోనూ లఖింపుర్ ఘటనపై విపక్షాలు ఆందోళన చేశాయి.
సిట్ దర్యాప్తులో..
లఖింపుర్ ఖేరిలో రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడి వాహనంతో దూసుకెళ్లిన ఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) స్పష్టం చేసింది. పక్కా ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన జరిగిందని.. నిర్లక్ష్యంతో కాదని తెలిపింది. ఈ నేపథ్యంలో నిందితులపై హత్యాయత్నం అభియోగాలు మోపేందుకు అనుమతించాలని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం)ను సిట్ అధికారి విద్యారామ్ దివాకర్ అభ్యర్థించారు.
Also Read: India New CDS: భారత నూతన COSCగా ముకుంద్ నరవాణే బాధ్యతల స్వీకరణ
Also Read: Central Cabinet: అమ్మాయి పెళ్లి వయసు 18 కాదు 21 ఏళ్లు.. త్వరలోనే పార్లమెంట్‌లో చట్టం
Also Read: Kamareddy: ఈ ఊర్లో లిక్కర్ అమ్మితే రూ.లక్ష, కొనాలంటే రూ.50 వేలు.. నాలుగేళ్ల నుంచి ఇంతే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి