ప్రస్తుతం నడుస్తోన్న ఆధునిక యుగంలో అసాధ్యం అన్న మాటే లేదు అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో అసాధ్యాలను మనుషులు సుసాధ్యం చేశారు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన సంఘటనలు మనం చూడబోతున్నాం. అవును.. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ మరో సంచలనానికి తెరతీశారు. ఆయన స్థాపించిన బ్రెయిన్ మిషన్ ఇంటర్‌ఫేస్ కంపెనీ 'న్యూరాలింక్' తాజాగా మనుషులపై ప్రయోగాలకు సిద్ధమైంది.
డైలీమైల్.కో.యూకే తెలిపిన వివరాల ప్రకారం.. న్యూరాలింక్ కంపెనీ ఓ క్లినికల్ ట్రయల్ డైరెక్టర్‌ను నియమించుకునే పనిలో ఉంది. సృజనాత్మకత కలిగిన వైద్యులు, టాప్ క్లాస్ ఇంజినీర్లతో ఈ డైరెక్టర్ దగ్గరగా పనిచేయాల్సి వస్తుంది. అలానే న్యూరాలింక్ సంస్థ మనుషులపై చేయబోతోన్న తొలి క్లినికల్ ట్రయల్‌లో పాల్గొనే వారిని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి.
అసలేంటిది?
2017లో ఎలన్ మస్క్ స్థాపించిన 'న్యూరాలింక్' డెవలప్ చేస్తోన్న'బ్రెయిన్ ఇంప్లాంట్'లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గతేడాది టెక్నాలజీలో భాగంగా న్యూరాలింక్ సంస్థ కోతి, పందుల మెదడులో చిప్‌ను అమర్చించింది.
చిప్ అమర్చిన కోతి 'పింగ్ పాంగ్' అనే కంప్యూటర్ గేమ్‌ను ఆడింది. ఇప్పుడు 2022లో ఈ టెక్నాలజీలో మరో కీలక అడుగు పడనుంది.
న్యూరాలింక్ ప్రాజెక్ట్‌లో భాగంగా కోతుల్లో చిప్‌లను అమర్చి అనేక పరిశోధనలు నిర్వహించగా వాటి పనితీరు చాలా బాగుందని మస్క్ అన్నారు. గతేడాది కోతుల్లో అమర్చిన ఆ చిప్‌ను తొందర్లోనే మనుషుల్లో అమర్చనున్నట్లు మస్క్ ప్రకటించారు.
అదే లక్ష్యం..
ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.. మనిషి మెదడుకు, కంప్యూటర్‌కు డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వడమే. 'న్యూరాలింక్' ఇంప్లాంట్ పూర్తిగా వైర్‌లెస్ పద్ధతిలో కంప్యూటర్‌కు అనుసంధానం అవుతుంది.
ఎలా చేస్తారు?
తల వెనుక భాగాన చిన్నపాటి శస్త్రచికిత్స చేసి ఈ ఇంప్లాంట్‌ను అమర్చుతారు. దానికి ఉండే ఎలక్ట్రోడ్లను మెదడు దిగువభాగాన నాడులకు అనుసంధానం చేస్తారు. ఈ ఇంప్లాంట్ ఎలక్ట్రోడ్ల ద్వారా మెదడు ఇచ్చే సంకేతాలను కాపీ చేసి.. వైర్‌లెస్ పద్ధతిలో కంప్యూటర్‌కు పంపుతుంది. కంప్యూటర్ ఆ సంకేతాలను విశ్లేషించి.. మెదడు ఇచ్చిన ఆదేశాలేమిటనేది గుర్తించి, అమలు చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కంటే శక్తిమంతమైనది.
Also Read: Tips to Stay Calm: కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు తొమ్మిది చిట్కాలు...
Also Read: Plane Crash: ‘యూట్యూబ్’ వ్యూస్ కోసం విమానం కూల్చేశాడు.. ఇలా అడ్డంగా దొరికిపోయాడు!