Elon Musk Drugs Usage:


మస్క్‌పై డ్రగ్స్ ఆరోపణలు..


టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ (Elon Musk Drug Addiction) గురించి ఓ రిపోర్ట్ సంచలన విషయం బయట పెట్టింది. డిప్రెషన్‌ని పోగొట్టుకునేందుకు మస్క్ గతేడాది డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ మధ్య కాలంలో టెస్లా, స్పేసెక్స్ బోర్డ్‌ సభ్యులు చాలా సందర్భాల్లో దీని గురించి ప్రస్తావించారు. పరిమితికి మించి డ్రగ్స్ తీసుకోడం వల్ల ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాదు. ఈ వ్యసనం వల్ల ఆయన వ్యాపార సామ్రాజ్యానికీ నష్టం తప్పదని తేల్చి చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం...ఎలన్ మస్క్ LSDతో పాటు కొకైన్ కూడా తీసుకున్నాడు. ప్రైవేట్ పార్టీల్లో ఈ డ్రగ్స్‌ వినియోగించినట్టు తెలుస్తోంది. ఈ పార్టీలకు బడాషాట్స్‌ని పిలిచే వాడు మస్క్. అయితే..వాళ్లకో కండీషన్ పెట్టేవాడట. మొబైల్స్ లోపలికి తీసుకురాకూడదని ముందే తేల్చి చెప్పేవాడట. ఈ పార్టీల్లోనే డ్రగ్స్ మస్క్ డ్రగ్స్ తీసుకుంటాడని ఓ రిపోర్ట్‌ చెప్పింది. ఇక్కడే మరో వాదన కూడా ఉంది. డిప్రెషన్‌ని అధిగమించేందుకు మస్క్ డాక్టర్ల సిఫార్సుతోనే వీటిని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కెటమైన్ డ్రగ్‌ని వాడేందుకు డాక్టర్ ప్రిస్‌క్రిప్షన్ కూడా ఉందని సమాచారం. గతంలో marijuana డ్రగ్‌ని బహిరంగంగానే తీసుకున్నట్టు ఈ రిపోర్ట్‌ వెల్లడించింది. 2018లో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఓ పార్టీలో ఎలన్ మస్క్ యాసిడ్ ట్యాబ్లెట్స్ తీసుకున్నాడు. ఈ తరవాత మెక్సికోలో జరిగిన పార్టీలో magic mushrooms వాడాడు. 


ఉద్యోగులేమంటున్నారు..?


మస్క్‌తో పాటు అతని సోదరుడు కింబల్ మస్క్‌ కూడా ketamine ని వాడతాడని తెలుస్తోంది. 2021లో మియామిలో వీళ్లిద్దరూ ఈ డ్రగ్‌ తీసుకున్నారని ఈ రిపోర్ట్ చెప్పింది. ఈ డ్రగ్స్ తీసుకున్న సమయంలో మస్క్‌ ప్రవర్తన పూర్తిగా మారిపోతుందని, టెస్లా మాజీ డైరెక్టర్ లిండా జాన్సన్ వెల్లడించారు. అందుకే 2019లో మరోసారి డైరెక్టర్ పోస్ట్‌కి ఎన్నికలు జరిగినా ఆమె పోటీ చేయకుండా దూరంగా ఉండిపోయారు. 2017లో జరిగిన ఓ ఈవెంట్‌కి మస్క్ దాదాపు గంట ఆలస్యంగా వచ్చారట. ఆ సమయంలో ఆయన చాలా మత్తులో ఉన్నారని, ఏదేదో మాట్లాడారని కొంత మంది ఎగ్జిక్యూటివ్స్‌ చెప్పారు. 2018లో ఓ షోలోనే నేరుగా డ్రగ్స్ తీసుకున్నాడు మస్క్. అది అప్పట్లో వివాదాస్పదమైంది. SpaceX తోపాటు Teslaలో డ్రగ్స్ వినియోగం విషయంలో నిబంధనల్ని పాటించడం లేదన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. సీఈవో స్థాయి వ్యక్తి ఇలాంటి ప్రవర్తనతో కంపెనీ ప్రతిష్ఠని పాడు చేస్తున్నారని కొందరు వాదిస్తున్నారు. 


దాదాపు ఏడేళ్ల తరవాత తన తండ్రి ఎరాల్ మస్క్‌ని (Errol Musk) ఈ మధ్యే కలిశాడు ఎలన్ మస్క్. The Sun వెల్లడించిన వివరాల ప్రకారం..టెక్సాస్‌లోని Boca Chicaలో ఈ రీయూనియన్‌ జరిగింది. తన మాజీ భార్యతో కలిసి ఈ ఈవెంట్‌కి అటెండ్ అయ్యారు ఎరాల్ మస్క్. ఏడేళ్లుగా తండ్రికొడుకులు కలుసుకోలేదు. ఇన్ని రోజుల తరవాత వీళ్లిద్దరూ కలిసి ఓ ఈవెంట్‌లో కనబడడం ఆసక్తిని పెంచింది. స్పేస్‌ఎక్స్ తయారు చేసిన అతిపెద్ద రాకెట్‌ Starship.ఇంత కీలకమైన ఈవెంట్‌లో తండ్రీ ఉండాలనుకున్నాడట ఎలన్ మస్క్. అందుకే విభేదాలన్నీ పక్కన పెట్టి మరీ ఆయనకు వెల్‌కమ్ చెప్పాడు.


Also Read: అయోధ్య ఉత్సవ సమయంలో ముస్లింలు బయటకు రాకండి - అసోం నేత సంచలన వ్యాఖ్యలు