Aurangzeb Tomb Cogntroversy: ఔరంగజేబు అనే మొఘల్ చక్రవర్తి చనిపోయి మూడు వందల ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు ఆయన కారణంగా నాగపూర్ మండిపోతోంది. ఘర్షణలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన సమాధి నాగపూర్ లో ఉంది. దాన్ని తొలగించాలంటూ ఆందోళనలు పెరుగుతున్నాయి. సోమవారం పెద్ద ఎత్తున హింస చెలరేగింది.దీంతో పలువుర్ని అరెస్టు చేశారు. ఇప్పుడు ఔరంగజేబు వివాదం ఎందుకు వచ్చిందంటే..చాలా సినిమా వల్లనే. ‘ఛావా’ సినిమా చూసి మొఘలు చక్రవర్తి ఔరంగజేబ్‌పై మరాఠా ప్రజలు కోపం పెంచుకున్నారని మహారాష్ట్ర సీఎం కూడా చెబుతున్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు ఛావా సినిమా కారణమని ఆయన ప్రకటించారు.
ఛావా సినిమాలో విక్కీ కౌశల్ హీరోగా నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తీశారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు. ఔరంగ్ 300 ఏళ్ల కిందట మరణించాడని ఈ అంశం ఇప్పుడు లేవనెత్తాల్సిన అవసరం ఏంటని మహారాష్ట్ర రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నాగపూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్. ఔరంగజేబు గుజరాత్‌లోనే పుట్టాడు. 1618లో గుజరాత్‌లోని దహోడ్‌లో జన్మించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు.. 1707లో మహారాష్ట్రలోని భింగార్‌లో చనిపోయాడు. నాగపూర్ లో సమాధిని నిర్మించారు.
నాగపూర్ అల్లర్లపై ఆర్ఎస్ఎస్ కూడా స్పందించింది. అసలు ఈ సమాధి నేటికి సంబంధించినది కాదని.. ఇలాంటి అల్లర్లు హానికరమని స్పష్టంచేసింది. అల్లర్లు ఉద్దేశపూర్వకంగానే సృష్టించారని అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే ఉంది. దీంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని.. మత ఘర్షణలు చెలరేగుతున్నాయని మహారాష్ట్ర రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తన్నాయు. ఈ ఘర్షణలంతటికి కారణం అయిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఉద్దేశపూర్వకంగానే ఓ వర్గం నేతలు దాడులకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఔరంగజేబ్ సమాధిని తొలిస్తున్నారని ముందుగా సోషల్ మీడియాలో పుకార్లు రేపి ఆ తర్వాత దాడులు చేశారని పోలీసులు గుర్తించారు. యాభై మందికిపైగా దాడుల్లో పాల్గొన్న వారిని అరెస్టు చేశారు.