రాష్ట్రంలో అల్లర్ల టైంలో జగన్ లండన్ పర్యటనా? లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల నడుమ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి రెండు రోజుల క్రితం యూకే పర్యటనకు వెళ్లడంపై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ఆదివారం (మే 19) లక్ష్మీ నారాయణ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వివిధ చోట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలు, ఘర్షణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


అమెరికాకు వెళ్లిన చంద్రబాబు, ఐదారు రోజుల పాటు అక్కడే
ఎన్నికల హడావుడి, పోలింగ్ కూడా ముగియడంతో రాజకీయ పార్టీల అధినేతలు విశ్రాంతి పొందుతున్నారు. కొంత మంది విదేశాలకు వెళ్లి సేద తీరుతుండగా.. మరికొంత మంది దేశీయంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్తున్నారు. నిన్న సీఎం  జగన్ లండన్ పర్యటనకు వెళ్లగా.. నేటి నుంచి చంద్రబాబు అమెరికా పర్యటన కొనసాగనుంది. చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఆ షరతు విధింపు
తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, కొన్ని షరతులు విధించింది. జూన్ 4 లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని షరతు విధించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని పేర్కొంది. అలాగే, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులెవరూ ఈ భేటీకి వెళ్లకూడదని ఆదేశించింది. కాగా, ఎన్నికల కోడ్ కారణంగా శనివారం జరగాల్సిన కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వలేదు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తెలంగాణలో మరో ఎయిర్ పోర్టుకు ముందడుగు - రేవంత్ రెడ్డి రివ్యూ
దశాబ్దాలుగా వరంగల్ వాసులు ఆశగా ఎదురు చూస్తున్న కల నెరవేరనుంది. వరంగల్‌ విమానాశ్రయం (Warangal Airport) నిర్మాణానికి ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన తరవాత వరంగల్‌ విమానాశ్రయం వ్యవహారాలపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక వరంగల్ ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ సైలెంట్‌గా ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


అధికారం నిలబడాలంటే సీమలో నిలబెట్టుకునే బలమే కీలకం - వైసీపీ ఆశలు నెరవేరతాయా ?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలు ఉన్నాయి. మెజార్టీ మార్క్  సాధించడానికి 88 స్థానాల్లో విజయం సాధించారు. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో వైసీపీ గత ఎన్నికల్లో 49  స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి మూడు అంటే మూడు దక్కాయి. అది అసలైన స్వీప్. గతంలో ఉత్తరాంధ్ర, కోస్తాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. కానీ.. ఈ సారి మాత్రం భిన్నమైన రాజకీయం కనిపిస్తోంది. విపక్షాలు కూటమిగా ఏర్పడటం, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తున్న సమయంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ వైఎస్ఆర్‌సీపీకి భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి