Telugu News Today - టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేత - 5 స్థానాల్లో అభ్యర్థుల మార్పు
ఏపీలో నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఆదివారం బీ ఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన టీడీపీ అభ్యర్థులు ఆదివారం ఉదయమే అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అంతా కృషి చేయాలని అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఇదేనా వైఎస్ఆర్ వారసత్వం? వైసీపీకి ఓటేస్తే బూడిదలోపోసిన పన్నీరే - షర్మిల
ఏపీలో అధికార వైఎస్ఆర్ సీపీకి ఓటు వేయడం.. బూడిదలో పోసిన పన్నీరుతో సమానమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ 10 ఏళ్లలో కర్నూల్ లో జరిగిన అభివృద్ధి శూన్యం అని అన్నారు. కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని దుస్థితి ఉందని.. కర్నూల్ న్యాయ రాజధాని అని మోసం చేశారని అన్నారు. ఇటుకపెళ్ళ కూడా కట్టలేదని.. అటు గుండ్రేవుల ప్రాజెక్ట్ వైఎస్ఆర్ కట్టాలని అనుకున్న ప్రాజెక్ట్ అని అన్నారు. అది పూర్తయి ఉంటే 2 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేదని అన్నారు. కర్నూల్ లో 6 లక్షల మంది ప్రజలకు తాగునీరు కూడా వచ్చేదని అన్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తెలంగాణ ఎన్నికల ప్రచారానికి మోదీ, అమిత్‌ షా, తేదీలు ఖరారు
తెలంగాణలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణలోని కీలక నేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో కేంద్ర అగ్ర నాయకులు కూడా తెలంగాణలో ప్రచారానికి రానున్నారు. ముఖ్య నాయకుల ప్రచారంతో జోరు పెంచేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ నెల 25న నామినేషన్ల దాఖలు గడవు ముగియనున్ననేపథ్యంలో పలువురు జాతీయ నేతలు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రచారానికి వస్తున్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రాయి దాడి కేసులో కీలక పరిణామం, టీడీపీ నేతను విడిచిపెట్టిన పోలీసులు
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన రాయి దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా ఓ టీడీపీ నాయకుడిని భావిస్తుండగా.. అతణ్ని పోలీసులు విడిచిపెట్టారు. వేముల దుర్గారావు అనే టీడీపీ నాయకుడు గత నాలుగు రోజులుగా పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఆయన్ను పోలీసులు బయటకు కనిపించకుండా చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


చిరంజీవి మద్దతు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికే - ఓపెన్‌గా చెప్పిన మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నోట మరోసారి రాజకీయాలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. కొన్నేళ్లుగా ఆయన దేశ - రాష్ట్ర రాజకీయాలకు, అదే విధంగా రాజకీయ పరమైన  వ్యాఖ్యలు - కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాలు మాత్రం ఆయనకు ఎప్పుడూ దూరం కాలేదని చెప్పాలి. మెగాస్టార్ తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉండటంతో చిరు పేరు ప్రస్తావనకు వస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి