శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష - 2 లక్షల జరిమానా
వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులకు కోర్టు పద్దెనిమిది నెలల జైలు శిక్ష , రెండు లక్షల జరిమానా విధించింది. దళితులకు శిరోముండనం కేసులో  27 ఏళ్లకుపైగా విచారణ సాగిన తర్వాత విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు నేరం చేసినట్లుగా నిర్ధారించి తీర్పు ఇచ్చింది.  ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. 1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో వైసిపి ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


జనసేనకు భారీ ఊరట - గాజు గ్లాసు గుర్తుపై సవాల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
ఎన్నికల ముందు జనసేన (Janasena) పార్టీకి భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు (Ap Highcourt) మంగళవారం కొట్టేసింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్.. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయగా విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా, జనసేనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీనిపై జనసైనికులు హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


సీఎం జగన్ పై రాయి దాడి చేసింది ఆ యువకుడే! - నిందితులను గుర్తించిన సిట్
సీఎం జగన్ (Cm Jagan)పై రాయి దాడి ఘటనకు సంబంధించి సిట్ దర్యాప్తులో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఐదుగురు యువకులను అనుమానితులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీగా చెందిన సతీష్ అలియాస్ సత్తి అనే యువకుడే సీఎంపై రాయితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో అతనితో పాటు ఉన్న నలుగురిని సైతం సిట్ అదుపులోకి తీసుకుంది. దాడికి గల కారణాలపై యువకులను అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


టర్‌ ఐడీ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవాలా... అయితే ఇలా చేయండి
ఓటు ఉన్న ప్రతిఒక్కరికీ ఓటర్‌ ఐడీ కార్డు చాలా అవసరం. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లకు... ఓటర్‌ ఐడీ కార్డు మంజూరు చేస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మన దగ్గర ఓటర్ ఐడీ కార్డు  ఉంటే.. ఎంతో మంచిది. ఓటర్‌ ఐడీ కార్డు.. ఓటు వేసే సమయంలో గుర్తింపు కార్డుగానే కాదు.. చాలా సందర్భాల్లో కూడా ఉపయోపడుతుంది. చాలా మంది ఓటర్‌ ఐడీ కార్డును ఇంట్లో భద్రంగా దాచుకుంటారు. ఎప్పుడూ వెంట పెట్టుకోరు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


దానం - మజ్లిస్ కాంబినేషన్‌తో కిషన్ రెడ్డిని ఓడిస్తారా ?
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్ పోటీ చేస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు.  సీనియర్ బీసీ నాయకుడైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను చేర్చుకుని మరీ ఎంపీ టిక్కెట్ ఇచ్చారు.  సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కు సొంత బలం, బలగం ఉంది. గతంలో నాంపల్లి ఎమ్మెల్యేగా ముస్లిం వర్గాలతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి