జగన్‌పై దాడి హత్యాయత్నమే, ఇది చంద్రబాబు ప్రీప్లాన్డ్ అటాక్ - సజ్జల ఆరోపణలు
సీఎం జగన్ పైన జరిగిన దాడి హత్యాయత్నమే అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి ఆరోపించారు. సరిగ్గా కణతి చూసి గురి చూసి దాడి చేశారని.. కొంచెం తేడా వచ్చినా ప్రాణం పోయేదని అన్నారు. చంద్రబాబే ఈ దాడి చేయించారని సజ్జల తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ బస్సు యాత్రకు వస్తున్న ఆదరణను సహించలేక చంద్రబాబు ప్రీ ప్లాన్డ్ అటాక్ చేయించారని సజ్జల ఆరోపించారు. తాడేపల్లిలోని సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ కు సున్నితమైన భాగంలో గాయం అయిందని.. కనుబొమ్మకు ఇంకాస్త కింద రాయి తగిలి ఉంటే కన్ను పోయి ఉండేదని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సీఎం జగన్ పై దాడి ఘటన - కేంద్ర ఎన్నికల సంఘం ఆరా
సీఎం జగన్ (CM Jagan)పై రాయి దాడి ఘటనకు సంబంధించి కేంద్రం ఎన్నికల సంఘం (Central Election Commission) ఆరా తీసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. వీఐపీల భద్రతలో వైఫల్యాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ హింస పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇటీవల చిలకలూరిపేటలోని ప్రధాని సభ, ఇప్పుడు సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు సంధించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కాంగ్రెస్‌తో ఎంఐఎం పొత్తు ఉందా? క్లారిటీ ఇచ్చిన ఒవైసీ
తెలంగాణలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో పొత్తులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ, ఎంఐఎం మధ్య పొత్తు ఉంటుందన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు లేదని, ఎలాంటి అవగాహన కుదుర్చుకోలేదని మజ్జిస్‌ అధినేత ఒవైసీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రాజకీయాలకు ఫేక్ వైరస్ - అరికట్టే వ్యవస్థే లేదా ?
భారత అత్యున్నత ప్రజాస్వామ్యం అని ఎందుకు అంటామంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందనే.  భారత ప్రజాస్వామ్యానికి ఎన్ని రకాల అవలక్షణాలు ఉన్నా ప్రజల చైతన్యంతో ఎప్పటికప్పుడు మన గలుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు అతి పెద్ద సవాల్ ఫేక్ న్యూస్ రూపంలో వస్తోంది. ఎన్నికలు వస్తే చాలు ఫేక్ న్యూస్ వెల్లువలా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోంది. ప్రముఖ సంస్థల పేర్లు వాడుకుని డీప్ ఫేక్ వీడియోలు చేయడం దగ్గర్నుంచి కొత్త కొత్త టెక్నాలజీని వాడుకుని ప్రజల్లో గందరగోళం గురి చేయడం వరకూ రాజకీయ పార్టీ దేన్నీ వదులుకోవడం లేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


చంద్రబాబు జగన్ పై కుట్ర చేశారన్న మాజీ మంత్రి వెల్లంపల్లి
విజయవాడలో 'మేమంతా సిద్ధం' (Memantha Siddam) బస్సు యాత్ర చేస్తుండగా సీఎం జగన్ (CM Jagan) పై సింగ్ నగర్ వద్ద రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (Vellampalli Srinivas) కు సైతం గాయమైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఘటన సమయంలో జరిగిన పరిస్థితిని వివరిస్తూనే టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ కు రాయి తగిలిన వెంటనే నాకు గాయమైంది. ఆ సమయంలో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి