Telugu News Today - పవన్‌ కల్యాణ్‌ను ఓడించకపోతే రాష్ట్రానికి ప్రమాదం - మహాసేన రాజేష్ రివర్స్ !
జనసేన పార్టీకి తాము మద్దతు ఉపసంహరించుకుంటున్నామని మహాసేన రాజేష్ ప్రకటించారు. పవన్ కల్యాణ్త్ తో పోలిస్తే  మా వర్గాలకు జగన్ బెటరని అనిపిస్తుందని.. వీళ్లిద్దరి కన్నా చంద్రబాబు గారు చాలా చాలా బెటరని అన్నారు. కులం మతం పేరుతో అమాయకులపై దాడి చేసేవారు ఎవరైనా  సరే వారికీ  వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ చెప్పానన్నారు. పవన్ కల్యాణ్ వలన జరిగే అనర్ధాలకు ప్రజలకు తెలియచేస్తామన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బద్వేల్‌లో షర్మిలపై కేసు నమోదు- కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించారని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై బద్వేల్‌లో కేసు నమోదు అయింది. ఎన్నికల రూల్స్ అతిక్రమించారని ఆమెపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కడప జిల్లా ఎన్నికల ప్రచారంలో ఉన్న షర్మిల పలు అంశాలు ప్రస్తావించారు. అందులో భాగంగా వైఎస్‌ వివేక మర్డర్ కేసు అంశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే కేసు నమోదుకు కారణమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ వివేక హత్య కేసు అంశాన్ని ప్రస్తావించొద్దని ఈ మధ్య కాలంలోనే కడప కోర్టు తీర్పు వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్లారా? - ఆ ప్రచారంలో నిజమెంత?
2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్లినట్లు ఎలాంటి సమాచారం లేదు. ఈ వైరల్ ఫోటో.. ఇటీవల 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించినప్పటిది. ఈ సందర్భంగా పలువురు హిందూ పూజారులు అసదుద్దీన్ ఒవైసీకి పూల మాల వేసి, శాలువాతో సత్కరించిన సందర్భంలో తీసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


విషం చిమ్మవద్దు ఇలా చేయండి - మోదీకి కేటీఆర్ సూచన
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సూచనలు చేశారు.  పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మవద్దని.. దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగాలని సలహా ఇచ్చారు.  ప్రధానిగా పదేళ్లు గడిచినా తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పాలన్నారు.  ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో చెప్పాలన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


గజపతినగరంలో టగ్‌ ఆఫ్‌ వార్‌- టీడీపీ సిక్స్‌ కొడుతుందా? వైసీపీకి రెండో ఛాన్స్ ఉంటుందా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ మరో ఆరు రోజుల్లో జరగనుంది. ప్రచారానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. దీంతో గెలుపు కోసం పార్టీలన్నీ ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలపై కూటమి ప్రత్యేక దృష్టి పెట్టింది. కచ్చితంగా ఆ జిల్లాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకొని అభ్యర్థుల ప్రకటన నుంచి ప్రచారం, పోల్‌మేనేజ్‌మెంట్ వరకు అన్నీంటిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి