Elections 2024 :  జనసేన పార్టీకి తాము మద్దతు ఉపసంహరించుకుంటున్నామని మహాసేన రాజేష్ ప్రకటించారు. పవన్ కల్యాణ్త్ తో పోలిస్తే  మా వర్గాలకు జగన్ బెటరని అనిపిస్తుందని.. వీళ్లిద్దరి కన్నా చంద్రబాబు గారు చాలా చాలా బెటరని అన్నారు. కులం మతం పేరుతో అమాయకులపై దాడి చేసేవారు ఎవరైనా  సరే వారికీ  వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ చెప్పానన్నారు. పవన్ కల్యాణ్ వలన జరిగే అనర్ధాలకు ప్రజలకు తెలియచేస్తామన్నారు. ఇప్పటికే చాలా సహించామని జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో ఓడించడానికి రాజ్యాంగబద్ధంగా  పని చేస్తామన్నారు. మాకు రాజకీయాలు, పదవులు ముఖ్యం కాదన్నారు. అన్యాయానికి గురవుతున్న ప్రజల తరపున  పోరాడటమే తమకు ఇష్టమన్నారు. నాయకుల్లో నిలకడ లేనప్పుడు మేము కూడా నిలకడగా ఉండలేమన్నారు.


ఇదే అంశంపై మహాసేన రాజేష్ వీడియో చేశారు. యూట్యూబ్ లో వీడియో చేశారు. గతంలో తనను తాను జన సైనికుడిగా ప్రకటించుకున్నానన్నారు. అయినా ఒక్కరు కూడా వచ్చి తననుపార్టీలోకి ఆహ్వానించలేదన్నారు. అయినా జనసేన కోసం పని చేసినా స్పందించలేదన్నారు. జనసేన కోసం పని చేసిన దళిత నేతల్ని కూడా పవన్ పట్టించుకోలేదని ఆరోపించారు. తాను గన్నవరంలోనే పోటీ చేయడానికి చాన్స్ ఇస్తే అడ్డుకున్నారన్నారు. పోటీ నుంచి వైదొలికిన తర్వాత .. కూటమి కోసం తాను ప్రచారం చేస్తున్నానని.. అయినా తన సమావేశాలకు ఒక్క సారి కూడా పవన్ రాలేదన్నారు. మహాసేన సమావేశాలకు పవన్ రాలేదన్నారు.            


అలాగే పవన్ కల్యాణ్ మోదీ పాల్గొన్న సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై మహాసేన రాజేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ మూడొంతుల మెజార్టీ సాధించేందుకు ప్రాణత్యాగం చేస్తానని పవన్ చెప్పానని అది కరెక్ట్ కాదన్నారు. ముస్లిం రిజర్వేషన్ల పై జగన్ హీరోలా స్పందించారన్నారు. నిజానికి బీజేపీకి మూడొంతుల మెజార్టీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని రాజేష్ అన్నారు. కానీ తాను బతికున్నంత వరకూ రిజర్వేషన్ల జోలికి ఎవరూ రాలేరని మోదీ ప్రకటించారు. కావాలని విమర్శించడానికి రాజేష్ ఇలా వీడియో చేశారన్న అభిప్రాయం వినపిస్తోంది.                                                      


మహాసేన రాజేష్ కు.. టీడీపీ పి.గన్నవరం టిక్కెట్ ఇచ్చింది. తర్వాత జనసేన పార్టీ అభ్యరంతరాలతో ఆ సీటు మహాసేన రాజేష్ తీసుకుంది. అమలాపురం తీసుకోవాల్సిన జనసేన.. తనకు సీటు లేకుండా చేయడానికే పట్టుబట్టి పి.గన్నవరం తీసుకుందని రాజేష్ భావిస్తున్నారు. ఆ కోపంతో పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యతిరేక చూపిస్తున్నట్లుగా భావిస్తున్నారు.  గతంలోనూ మహాసేన తరపున ఇండిపెడెంట్లుగా పోటీ చేస్తామని ప్రకటించారు. తర్వాత విరమించుకున్నారు. కూటమి తరపున ప్రచారం చేస్తామన్నారు. మళ్లీ ఇప్పుడు  రివర్స్ అవుతున్నారు. మహాసేన వ్యవహారం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.