AP Telangana News: విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని ఔట్- క్లారిటీ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టువిజయవాడ(Vijayawada) టీడీపీ(TDP)లో మరోసారి కలకలం రేగింది. విజయవాడ ఎంపీ(Vijayawada MP) స్థానం వేరే వాళ్లకు ఇస్తున్నట్టు తెలుగుదేశం క్లారిటీ ఇచ్చేసింది. ఈ విషయాన్ని ప్రస్తుత ఎంపీ కేశినేని నాని(Kesineni Nani)కి తెలియజేసింది. అందుకే అక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకోబోనని నాని సోషల్ మీడియా(Social Media) ద్వారా తెలియజేశారు. టీడీపీ రాజకీయాల్లో విజయవాడది ప్రత్యేక స్థానం. ముక్కుసూటిగా మాట్లాడే నాని తరచూ వివాదాల్లోకి వస్తుంటారు. ఆయన దూకుడుతో తరచూ టీడీపీని ఆ పార్టీ నేతలను ఇరకాటంలో పెట్టేస్తుంటారు. అప్పుడప్పుడూ పార్టీ ప్రత్యర్థులతో సన్నిహితంగా మెలుగుతూ కూడా వార్తల్లో హాట్‌టాపిక్ అవుతూ ఉంటారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ వల్ల వైసీపీ, టీడీపీల్లో ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(YSRTP) అధినాయకురాలు వై.ఎస్.షర్మిల(YS Sharmila) ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతగా కొత్త భూమికను పోషించబోతున్నారు. పార్టీలో విలీనం తర్వాత ఎక్కడైనా పని చేస్తానని ప్రకటించారు.అది ఏపీ అయినా అండమాన్ అయినా సరే అని స్పష్టం చేశారు. ఆమె చేరిక కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ రాకపోవడంతో ఆమె నీడ తెలంగాణ కాంగ్రెస్ పై పడేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదని అర్థమవుతుంది. మరి షర్మిలకు ఉన్న ఒకే ఒక్క చాయిస్ ఏపీ. అదుకే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి(AP congress) సారథ్యం వహించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కాళేశ్వరంపై విచారణ ఎవరు చేయాలి ? కాంగ్రెస్, బీజేపీ ఎందుకు పోటీ పడుతున్నాయి ?తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఇప్పుడు గేమ్ చేంజర్‌గా మారుతోంది. జ్యూడీషియల్ విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోపు భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా తెర ముందుకు వచ్చింది. సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని డిమాండ్ చేస్తోంది. గతంలో సీబీఐ విచారణ అడిగారు కదా ఇప్పుడు ఎందుకు కాళేశ్వరం అవినీతిని సీబీఐకి ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ దొంగ నాటకాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టీడీపీకి, కేశినేని నాకి మధ్య ఎక్కడ చెడింది ? లోకేష్‌తో సఖ్యత లేకపోవడమే సమస్యగా మారిందా ?విజయవాడ పార్లమెంట్ స్థానం నంచి తెలుగుదేశం పార్టీ వేరే అభ్యర్థిని నిలబెడుతుందని ఈ సారికి టిక్కెట్ లేదని సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి హైకమాండ్ స్పష్టత ఇచ్చింది. పార్టీ వ్యవహారాలలో పెద్దాగ జోక్యం చేసుకోవద్దని కూడా సలహా ఇచ్చింది. నిజానికి టీడీపీ హైకమాండ్ ( Tdp highcommand ) ఇలా ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు ఎవరికీ చెప్పదు. కానీ కేశినేని నానికి మాత్రం చెప్పింది. ఈ అంశం పార్టీలో కలకలం రేపుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కందుకూరు టీడీపీలోకి బీజేపీ లీడర్- ఆమె రాకతో అసెంబ్లీ సీటుపై మారుతున్న అంచనాలుకొత్తగా నెల్లూరు జిల్లాలో చేరిన నియోజకవర్గం కందుకూరు. 1999 తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ(TDP)కి అవకాశమే రాలేదు. నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా రెండుసార్లు వైసీపీ(YSRCP) అభ్యర్థులే ఇక్కడి నుంచి గెలిచారు. ఈసారి మాత్రం ఇక్కడ టీడీపీ పాగా వేయాలనుకుంటోంది. అందు కోసం కాస్త బలంగానే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ ఇక్కడ టీడీపీ ఇన్ చార్జ్ గా ఇంటూరి నాగేశ్వరరావు ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి