మొత్తం 40 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 20వేలకిపైగా సీసీ కెమెరాలతో హైదరాబాద్ నగరం మొత్తం నిఘా నీడలో ఉంది. ఇక బడా గణేశుడు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లో ముగిసింది. భారీ గణేశుడిని వీక్షించేందుకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శోభయాత్రను, నిమజ్జనాన్ని అధికారులు పూర్తి చేశారు.
ఇదిలా ఉంటే గణేశుడి శోభా యాత్రలో జనాలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. భక్తులు డీజీ సౌండ్స్‌తో గణనాథులను గంగమ్మ ఒడికి పంపించారు. డ్యాన్స్‌లు చేస్తూ ఉషారుగా శోభయాత్ర కొనసాగింది. ఈ క్రమంలోనే డ్యూటీలో బిజీగా ఉన్న పోలీసులు సైతం వారితో కలిసి స్టెప్పులు వేశారు. గణేశుడి నిమజ్జన పర్యవేక్షణలో ఉన్న పోలీసులు డీజే సౌండ్‌కు కాలు కదిపారు. ఓ గ్రూప్‌గా ఏర్పడ్డ పోలీసులు పని ఒత్తిడిని కాసేపు మరిచి చిందేశారు. ఇక వీరిలో ఓ పోలీస్ బాస్ వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. మైకేల్ జాక్సన్‌లా మారి అదిరిపోయే స్టెప్పులతో మెస్మరైజ్ చేశారు. ప్రస్తుతం పోలీసుల డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డ్యాన్స్ చూసిన నెటిజన్లు పోలీసుల స్టెప్పులకు ఫిదా అవుతున్నారు.
గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 28వ తేదీన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జంట నగరాలతో పాటు మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాల్లో కూడా బంద్ ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో జారి చేసింది. గురువారం రోజు పైన తెలిపిన చోట్ల పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయకు సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జంట నగరాల్లో నిమజ్జనం సందర్భంగా 21 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపారు. వీరితో పాటు అదనంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రైల్వే పోలీస్ ఫోర్స్‌తో నిఘా పెంచారు.
నిమజ్జనం రోజున హుస్సేన్ సాగర్ చుట్టూ రోడ్డుపై ఇసుక వేస్తే రాలనంత భక్తులు గుమిగూడి ఉత్సవాలు చేసుకున్నారు. వీరి రద్దీని కంట్రోల్ చేయడం కోసం పోలీసులు కూడా నిమజ్జన ప్రాంతాల్లో భారీగా మోహరించారు. భక్తుల ఆటపాటలు, డాన్సులతో బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేస్తుండగా పోలీసులు తమ బాధ్యతలు నిర్వహించారు.
ఈ ఏడాది మాత్రం పోలీసులు అడుగు ముందుకు వేశారు. హుషారుగా కాలు కదుపుతూ భక్తులతో పాటు ఊరేగింపులో వారు కూడా భాగస్వామ్యం పంచుకున్నారు. గణపయ్య భక్తులతో పాటు పోలీసులు కూడా అదిరిపోయే స్టెప్పులు వేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మిలాద్ ఉన్ నబీ, గణపతి నిమజ్జనం ఒకేరోజు రావడంతో మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకునే ముప్పును పోలీసులు అంచనా వేశారు.
హైదరాబాదులోని పాతబస్తీ సహా మిగిలిన ఏరియాలోను ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉంటారు. గణపతి నిమజ్జనం నగరంలో పెద్ద ఎత్తున జరుగుతుందని తెలిసిందే. ఈ రెండు ఒకేరోజు వచ్చినప్పటికీ నగరంలో మతపరమైన ఉద్రిక్తతలు ఎక్కడ కూడా చోటు చేసుకోలేవు. అంతేకాదు మతసామరస్యత వెల్లివెరిసింది.
హైదరాబాదులో ఇలాంటి మత ఘర్షణలు జరగవని రుజువైంది. ఒక మతాన్ని మరో మతం వారు గౌరవించుకోవడం స్పష్టంగా కనిపించింది. ముస్లింలు మిలాన్ నబి ఊరేగింపును అక్టోబర్ 1 వ తేదీకి వాయిదా వేసుకున్నట్లు సియాసత్ పత్రిక రిపోర్ట్ చేసింది. గణపతి నిమజ్జనం అదే రోజు రావడం వల్లే వాయిదా వేసినట్లు తెలిపింది. 28న వినాయకుని నిమజ్జనం కావడంతో శాంతియుతంగా వాళ్లు విరమించుకున్నారు. ఇకపోతే కొన్ని ఏరియాలో వినాయకుడు 15 రోజులకు నిమజ్జనం చేస్తున్నారు.