Huge Response To Prajavani: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఒకటి ప్రజావాణి  కార్యక్రమం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని... సమస్యలతో సతమతమయ్యారని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రజాసమస్యలు  తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమం చేపట్టింది. ప్రగతిభవన్‌ను జ్యోతిరావ్‌ పూలే ప్రజాభవన్‌గా పేరు మార్చి... అక్కడే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ  కార్యక్రమానికి మొదటి నుంచి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమానికి తరలివస్తున్నారు జనం. ప్రజావాణిలో  ఎక్కువగా భూముల సంబంధిత సమ్యలు, ధరణి, ఆరోగ్యం,నిరుద్యోగం అంశాలపైనే ఎక్కువ వనతిపత్రాలు వస్తున్నట్లు తెలుస్తోంది. 


తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం.. వారానికి రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. మంగళవారం, శుక్రవారాల్లో కచ్చితంగా ప్రజావాణి నిర్వహించాలని ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. దీంతో ఆ రెండు రోజుల్లో జ్యోతిరావ్‌ పూలే ప్రజాభవన్‌కు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు ప్రజలు. సమస్యలు చెప్పుకునేందుకు తెల్లవారుజాము  నుంచే ప్రజాభవన్‌ ముందు క్యూకడుతున్నారు. దీంతో ప్రజావాణి నిర్వహిస్తున్న రెండు రోజుల్లో ప్రజాభవన్‌ దగ్గర రద్దీ కనిపిస్తోంది. 


ఇవాళ (శుక్రవారం) కూడా ప్రజావాణి నిర్వహిస్తుండటంతో ప్రజలు భారీగా ప్రజాభవన్‌కు తరలివచ్చారు. తెల్లవారుజామున 5గంటల నుంచే ప్రజాభవన్‌కు పోటెత్తారు. ఉదయం  9గంటల అయ్యే సరికి.. ప్రజాభవన్‌ ముందు కిలోమీటర్ మేర క్యూలైన్‌ పెరిగిపోయింది. అయితే... పెద్దసంఖ్యలో తరలివస్తున్న ప్రజలను ఒక క్రమపద్ధతిలో ఉంచి... వారందరినీ  ఒక్కొక్కరిగా లోపలికి పంపడం అక్కడి భద్రతా సిబ్బందికి ఒక టాస్క్‌ అనే చెప్పాలి. ప్రజావాణికి విశేష స్పందన వస్తుండటం... సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్రం  నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వస్తుండటంతో... రద్దీ విపరీతంగా పెరుగుతోందని అధికారులు భావిస్తున్నారు.


ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మాత్రమే ప్రజావాణి నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వచ్చేందుకు ప్రజలు కూడా  ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో... ప్రభుత్వం ప్రత్నామ్యాయ మార్గాలు అన్వేషిస్తే బెటరని పలువురు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో  మాత్రమే కాకుండా... అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో ప్రజావాణి నిర్వహిస్తే బాగుటుందని సూచిస్తున్నారు. దీని వల్ల.. ఆయా నియోజకవర్గ ప్రజల సమస్యలకు... ఆయా  నియోజకవర్గాల పరిధిలోనే పరిష్కారం చూపినట్టు అవుతుంది. అంతేకాదు.. వారంతా హైదరాబాద్‌ వరకు రావాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు ప్రజాభవన్‌ దగ్గర రద్దీ  కూడా తగ్గుకుంది. దీని వల్ల అటు ప్రభుత్వ యంత్రాంగానికి... ఇటు ప్రజలకు భారం, ఒత్తిడి తగ్గే అవకాశం కూడా ఉంటుంది.


ఇక... తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాదర్భార్‌ పేరుతో కార్యక్రమం మొదలుపెట్టింది. మొదటి రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా.. ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. వారి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ప్రజాదర్భార్‌ను.. ప్రజావాణిగా పేరు మార్చారు. వారానికి రెండు సార్లు ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో రోజు ఒక్కో మంత్రు ప్రజావాణిలో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకోవాలని... వారి నుంచి వినతిపత్రాలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం... ప్రజావాణి కార్యక్రమానికి రోజుకో మంత్రి హాజరవుతూ.. ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకుంటున్నారు.