Vyooham Movie Latest News: వ్యూహం సినిమాపై హైకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలన్నది పిటిషనర్, ప్రతివాదులు కలిసి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కమిటీ సభ్యులు ఎవరనే నిర్ణయాన్ని తమకు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇలాంటి అంశంలోనే బాంబే హైకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది. అలాంటి కమిటీని ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నామని, సభ్యులను ఎంచుకొనే బాధ్యతను మాత్రం పిటిషనర్, ప్రతివాదులే చూసుకోవాలని హై కోర్టు సూచించింది. అలా ఏర్పాటు చేసిన కమిటీకి వ్యూహం సినిమాను చూపించాలని ధర్మాసనం నిర్దేశించింది. కమిటీ రిపోర్ట్ ను శుక్రవారం లోపు హై కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం వ్యూహం చిత్రంపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
Vyooham Movie: వ్యూహం మూవీపై హైకోర్టు కీలక నిర్ణయం - కమిటీ ఏర్పాటు
ABP Desam
Updated at:
09 Jan 2024 05:49 PM (IST)
Vyooham Movie News: గతంలో ఇలాంటి అంశంలోనే బాంబే హైకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది. అలాంటి కమిటీని ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నామని హైకోర్టు తెలిపింది.
వ్యూహం