తెలంగాణలో మరోసారి కొలువుల కోలహలం మొదలైంది. ఇటీవల కాలంలలో వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తున్న ప్రభుత్వం.. వైద్యశాఖలో 2140 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు స్పష్టతనిచ్చారు. రాబోయే రెండు రోజుల్లో బోధనాసుపత్రుల్లో 1140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 



అదేవిధంగా రానున్న 10 రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీల్లో) 1000 మంది డాక్టర్ల భర్తీకి నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. వీటితోపాటు మరో 140 మిడ్‌ వైఫరీ పోస్టులను కూడా త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు హరీశ్ రావు స్పష్టం చేశారు. 



నిమ్స్‌ దవాఖానలో ఏర్పాటు చేసిన ఇన్ఫెక్షన్‌ ప్రివెన్షన్‌ ట్రైనింగ్‌ కార్యక్రమాన్ని మంత్రి సెప్టెంబరు 23న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లో 1140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు.


Also Read
తెలంగాణలో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాలు - డిప్లొమా, బీటెక్ అర్హత!
తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్‌సీ) నుంచి మ‌రో నోటిఫికేష‌న్ వెలువడింది. వివిధ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్  పోస్టుల భ‌ర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా అర్హత ఉన్నవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబరు 29 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ సెప్టెంబరు 23 నుంచి అందుబాటులో ఉండనుంది.  
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read
తెలంగాణ మున్సిపల్‌ శాఖలో 175 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!
తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..



Also Read
ఈవో పోస్టుల దరఖాస్తు ప్రక్రియ షురూ, మహిళలు మాత్రమే అర్హులు!
తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో 181 విస్తరణాధికారుల (సూపర్‌వైజర్‌) గ్రేడ్‌-1 ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబరు 8న ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. సరైన అర్హతలు ఉన్న మహిళా అభ్యర్థులు సెప్టెంబరు 29న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక లింక్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు మొదటగా తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ నెంబరు, పుట్టిన తేది వివరాలు నమోదుచేసి మొబైల్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నిర్దారించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...