Queen Elizabeth II:


బ్రిటన్ ను సుదీర్ఘకాలం పాటు పాలించిన క్వీన్ ఎలిజబెత్- 2 ఈ నెల 8వ తేదీన 96 ఏళ్ల వయసులో మరణించారు. ఆమె మరణించిన తర్వాత కొద్ది సమయంలోనే ఆమె ఉపయాగించిన వస్తువులు ఆన్ లైన్ లో అమ్మకానికి వచ్చాయి. ఇందులో రాణి 1998లో ఉపయోగించిన టీ బ్యాగ్ నమ్మశక్యం కాని ధరకు అమ్ముడైంది. 


బ్రిటన్ రాణి దివంగత క్వీన్ ఎలిజబెత్- 2 ఉపయోగించిన వస్తువులు ఆన్ లైన్ వేలంలో అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఆమె 1998లో ఉపయోగించిన టీ బ్యాగ్ ఒకటి 12 వేల డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే భారత కరెన్సీలో అక్షరాల 9.5 లక్షల రూపాయలు. ఇది ఈబేలో వేలానికి ఉంచగా రికార్డు ధరకు అమ్ముడుపోయింది. 


ఈ టీ బ్యాగ్ కు రాయల్ ఫ్యామిలీ ప్రామాణికత సర్టిఫికెట్ ఉందని అమ్మకందారులు తెలిపారు. అలాగే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సర్టిఫికెట్స్ ఇచ్చిన సర్టిఫికెట్ ను దీనికి జోడించారు. ఇది ఒక టీ బ్యాగ్. చరిత్రలోని ఒక ముఖ్యమైన దాన్ని సొంతం చేసుకోండి. ఇది వెలకట్టలేనిది అని లిస్టింగ్ లో పేర్కొన్నారు. 


క్వీన్ ఎలిజబెత్- 2 జీవిత పరిమాణ మైనపు విగ్రహం కూడా ఈబేలో అమ్మకానికి పెట్టారు. దీని ప్రారంభ ధరను 15, 900 డాలర్లుగా (సుమార్ 12.6 లక్షలు) గా పేర్కొన్నారు. ఇంకా క్వీన్ యొక్క బార్బీ బొమ్మ వంటివి ఈ-కామర్స్ వెబ్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి.


ఎలిజబెత్‌-2.. ఏప్రిల్‌ 21వ తేదీ, 1926లో లండన్‌లోని 17 బ్రూటన్‌ స్ట్రీట్‌లో జన్మించారు.   గ్రీస్‌ యువరాజు, నేవీ లెఫ్టినెంట్‌ ఫిలిప్‌ మౌంట్‌బాటెన్‌ను 1947లో ఆమె వివాహం చేసుకున్నారు. వీళ్లకు.. ప్రిన్స్‌ ఛార్లెస్‌, ప్రిన్సెస్‌ అన్నె, ప్రిన్స్‌ ఆండ్రూ, ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ సంతానం. 1952, ఫిబ్రవరి 6వ తేదీన తండ్రి మరణించడంతో వారసురాలిగా ఎలిజబెత్‌ను ప్రకటించారు. అయితే ఆ టైంకి ఆమె రాయల్‌ టూర్‌లో కెన్యాలో ఉన్నారు. ఏడాది తర్వాత జూన్‌ 2వ తేదీన ఆమె వెస్ట్‌మిన్‌స్టర్‌ అబ్బేలో బ్రిటన్‌కు రాణిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.


క్వీన్‌ ఎలిజబెత్‌-2 పట్టాభిషేక సమయంలో బ్రిటన్‌ ప్రధానిగా విన్‌స్టన్‌ చర్చిల్‌ ఉన్నారు. 15 మంది ప్రధానులు.. ఈమె హయాంలో బ్రిటన్‌కు పని చేశారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌తోపాటుగా పద్నాలుగు దేశాల సార్వభౌమత్వం  ఎలిజబెత్‌-2 చేతిలోనే ఉంటుంది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌, జమైకా, ఆంటిగ్వా, బార్బుడా, బెహమస్‌, బెలిజే, గ్రెనెడా, పాపువా న్యూ గినియా, సోలోమన్‌ ఐల్యాండ్స్‌, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నేవిస్‌, సెయింట్‌ లూసియా, సెయింట్‌ విన్సెంట్‌, ది గ్రెనాడైన్స్‌, తువాలుకు కూడా క్వీన్‌ ఎలిజబెత్-2 మహారాణిగా వ్యవహరించారు.