Tathagat Avatar Tulsi Became IIT Professor at Age 22 But is Now Jobless : తథాగత్ అవతార్ తులసి .. ఈ పేరు ఇరవై ఏళ్ల కిందట మీడియాలో మార్మోగిపోయేది. బీహార్ కు చెందిన తథాగత్ అవతార్ తులసి అనే పిల్లవాడు అద్భుతాలు చేస్తున్నాడట అని.. విచిత్రంగా చెప్పుకునేవారు. ఎందుకంటే పదకొండేళ్లకే బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశాడు. మరో ఏడాదికి అంటే పన్నెండేళ్లకే ఎమ్మెల్సీ కూడా కంప్లీట్ చేశాడు. అతని ప్రతిభను గుర్తించిన ప్రభుత్వాలు కూడా పరీక్షలు రాసేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చేవి. ఆ తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో పీహెచ్‌డీ కూడా పూర్తి చేశాడు. మొత్తంగా ఐఐటీలో సీటు కోసం ఇతర విద్యార్థులు గట్టిగా ప్రయత్నించే సమయంలో ఆయన ఏకంగా ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగంలో చేరిపోయాడు.
ఉద్యోగం నుంచి తీసేసిన ముంబై ఐఐటీ
మరి ఇప్పుడు తథాగత్ అవతార్ తులసి ఎలా ఉన్నాడు ?. తన ఫిజిక్స్ నైపుణ్యంతో ఎన్నో అవార్డులు.. రివార్డులు సాధించి.. ప్రపంచమేధావిగా ఉన్నాడని ఎవరైనా అనుకుంటారు. కానీ నిజమేమిటంటే.. ఆయన ఇప్పుడు నిరుద్యోగి. పట్నాలోని తన సోదరుడి ఇంట్లో ఉంటూ .. కొత్త ఉద్యోగాల కోసం వెదుక్కుంటున్నారు. కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం. 2010లో ఇరవై ఒక్క ఏళ్ల వయసులోనే ముంబై ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరిన తథాగత్.. ఆ తర్వాత కొంత కాలం పాటు హాయిగానే ఉన్నారు. కానీ ఆ తర్వాతే ఆయనకు అసలు సమస్యలు ప్రారంభమయ్యాయి.
17 ఏళ్లకే లవ్ ఫెయిల్ - రోడ్డు పక్కన కాఫీ అమ్మారు -ఇప్పుడు కోట్లకు అధిపతి - ఈ మహిళ సాధించారు !
ఆరోగ్య కారణాలతో లాంగ్ లీవ్ పెట్టడంతో పోయిన ఉద్యోగం
ఆరోగ్యపరమైన సమస్యలు రావడంతో ఉద్యోగానికి తరచూ సెలవులు పెట్టాల్సి వచ్చింది. ఓ దశలో చికిత్స కోసం లాంగ్ లీవ్ పెట్టారు. దాంతో ఐఐటీ ముంబై యాజమాన్యం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఉద్యోగం తిరిగి రాలేదు. దాంతో చివరికి ఆయన తన సొంత ఊరు పట్నాకు వెళ్లిపోయారు. అక్కడ సోదరుడి ఇంట్లో ఉంటూ కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో క్రీమ్ బన్ పాలిటిక్స్ - నిర్మలా సీతారామన్ పై విమర్శలు
ఇప్పుడు కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు
తులసి చదువకునే సమయంలో అత్యంత ప్రతిభావంతునిగా ప్రపంచం గుర్తించింది. సూపర్ స్టీన్‌గా అంతర్జాతీయ మీడియా కీర్తించింది. ప్రఖ్యాత టైమ్స్ పత్రిక ఫిజిక్స్ ప్రాడిజిగా అభివర్ణించింది. ది వీక్ పత్రిక మాస్టర్ మైండ్ అని పొగిడింది అయితే ఇన్ని ఉన్నా.. ఇప్పుడు ఆయన నిరుద్యోగిగా ఉన్నారు. అనారోగ్య సమస్యలు వెంటాడతంతో పాటు.. సరిగ్గా ప్లానింగ్ లేకపోవడం కారణంగా.. ఎంతో మంది కన్నా వెనుకబడిపోయారు. ప్రపంచ గతిని మార్చే అద్భుతాలు చేసే టాలెంట్ ఉన్నా.. చివరికి నిరుద్యోగి కాలం వెళ్లదీస్తున్నారు.