Indian Dishes in Taste Atlas List: మన ఫుడ్‌ వెరైటీస్‌ కేవలం మనకే కాదు. మొత్తం ప్రపంచానికే తెగ నచ్చేస్తున్నాయట. మన వంటకాలను తలుచుకుంటేనే నోరు ఊరిపోతోందట. వరల్డ్ ఫేమస్ ఫుడ్ గైడ్  Taste Atlas ఈ విషయం వెల్లడించింది. భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉందని స్పష్టం చేసింది. కొన్ని వంటకాలు, డ్రింక్స్‌కి అందరూ ఫిదా అయిపోతున్నారని తెలిపింది. ఇందులో కొన్ని డిషెస్ ప్రపంచంలోనే టాప్‌గా నిలిచాయి.  'Best Stews In the World' పేరిట ఇటీవలే టేస్ట్ అట్లాస్‌ ఓ లిస్ట్‌ని విడుదల చేసింది. అందులో ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా 9 ఇండియన్ డిషెస్‌ ఈ జాబితాలో టాప్‌లో నిలిచాయి. ఒకే దేశం నుంచి ఇన్ని రకాల వంటకాలు ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకోవడం అరుదైన రికార్డు. ఈ జాబితాలో మొత్తం 50 రకాల వంటకాలుండగా ఆరోస్థానంలో మన భారత్‌కి చెందిన కీమా (Keema) చోటు దక్కించుకుంది. ఇక బెంగాల్‌కి చెందిన Chingri malai curry 18వ స్థానంలో నిలిచింది. 22వ స్థానంలో korma వంటకం నిలిచింది. 


గోవాకి చెందిన Vindaloo డిష్ కూడా 26వ స్థానంలో ఉంది. 30వ స్థానాన్ని  Dal Tadka దక్కించుకుంది. ఇక 32 వ ప్లేస్‌లో సాగ్ పనీర్, 34వ ప్లేస్‌లో షాహి పనీర్ (Shahi Paneer), 38వ స్థానంలో మహారాష్ట్రకు చెందిన Misal 36వ స్థానంలో నిలిచింది. భారత్‌లో మొత్తం సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్‌ రాష్ట్రాలకు చెందిన స్పెషల్ ఫుడ్‌ ఐటమ్స్ ఈ లిస్ట్‌లో ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ Best Stews in the World లిస్ట్‌లో థాయ్‌లాండ్‌కి చెందిన Phanaeng curry టాప్‌లో నిలిచింది. కొద్ది రోజుల క్రితమే టేస్ట్ అట్లాస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా బియ్యంతో తయారు చేసిన వంటకాల (Best Rice Puddings) జాబితాలో మూడు ఇండియన్ డిషెస్‌ చోటు దక్కించుకున్నాయి.