తమిళనాడులో 19 ఏళ్ల యువతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మైనర్ ని వివాహం చేసుకున్న కేసులో యువతికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. తమిళనాడు పొల్లాచికి చెందిన 19 ఏళ్ల యువతి స్థానికంగా ఉన్న పెట్రోల్ స్టేషన్లో  పనిచేస్తోంది. ఆ ప్రాంతంలో ఉంటున్న 17 ఏళ్ల యువకుడితో ప్రేమ వ్యవహరం నడిపింది. వీరిద్దరూ కలిసి పెట్రోల్ స్టేషన్​కు వెళ్లేవారు. ఈ క్రమంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఈ సమయంలో యువకుడు ఓ సర్జరీ కోసం ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. యువతి ఆసుపత్రికి వెళ్లి పెళ్లి సంబంధాల విషయం యువకుడికి చెప్పింది. 


Also Read: Hymenoplasty Surgery: ఇలా కన్యత్వాన్ని తిరిగి పొందవచ్చట.. వివాదాస్పద సర్జరీపై నిరసనలు


Also Read: Chiranjeevi Meets Kapildev: ఒకరు క్రికెట్ దిగ్గజం..మరొకరు ఇండస్ట్రీమెగాస్టార్..ఒకే ఫ్రేమ్‌లో ఎప్పుడు.. ఎక్కడ..


బలవంతంగా పెళ్లి


ఇంట్లో పెద్దలు పెళ్లి నిశ్చయించే ముందే పెళ్లి చేసుకుందామని యువకుడిని బలవంతం పెట్టింది. ఆ తర్వాత దగ్గర్లోని దేవాలయానికి వెళ్లి వివాహం చేసుకున్నారు. అనంతరం ఈ విషయం యువకుడి ఇంట్లో తెలిసింది. ఇంటికి వచ్చిన యువకుడిని తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో పెళ్లి విషయాన్ని చెప్పేశాడు. 19 ఏళ్ల యువతితో వివాహం చేసుకున్నట్లు తల్లిదండ్రులకు వివరించాడు. ఈ వ్యవహారంపై యువకుడి తల్లిదండ్రులు యువతిపై పొల్లాచి మహిళా పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.


Also Read: Hyderabad Crime: అల్లుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన అత్త.. సాయం చేసిన కూతురు


రిమాండ్ విధింపు


ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. యువకుడిని బలవంతం చేసి పెళ్లికి ఒప్పించినట్లు నిర్థారించుకున్నారు. ఈ విషయంపై దృష్టి సారించిన కోయంబత్తూరు జిల్లా ఎస్పీ యువతిని అరెస్టు చేయాలని ఆదేశించారు. యువతిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించింది.


Also Read: Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం... గేదె కళేబరం పైకెక్కి అదుపు తప్పి టిప్పర్ ను ఢీకొట్టిన ఆటో... ఐదుగురు మృతి


Also Read: Chintamaneni Prabhakar Arrest: మాజీ ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ అరెస్టు.. తక్షణమే విడుదల చేయాలని టీడీపీ డిమాండ్... డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు