మాకు ముందుగా తెలియలేదు: యూనివర్సిటీ వీసీ


తమిళనాడులోని పెరియార్ యూనివర్సిటీలో ఓ క్వశ్చన్ పేపర్‌ వివాదాస్పదమైంది. అందులో క్యాస్ట్‌కి సంబంధించిన ప్రశ్న అడగటంపై 
తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎమ్‌ఏ హిస్టరీ ఫస్ట్ ఇయర్‌ పరీక్షల్లో ఈ ప్రశ్న అడిగారు. "తమిళనాడులో ఎక్కువగా కనిపించే లోయర్ క్యాస్ట్ ఏంటి" అనే క్వశ్చన్ అందులో ఉంది. పైగా ఇదో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ కావటం వల్ల నాలుగు ఆప్షన్స్‌లో నాలుగు క్యాస్ట్‌ల పేర్లు ముద్రించారు. యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్ జగన్నాథన్...ఈ వివాదంపై స్పందించారు. ఇది ఎవరు చేశారో తప్పకుండా విచారణ జరుపుతామని వెల్లడించారు. హిస్టరీ మాస్టర్స్‌లో సెకండ్ సెమిస్టర్‌ ఎగ్జామ్‌లో ఈ క్వశ్చన్ అడిగారు. తమిళనాడు స్వాతంత్య్రోద్యమం( 1800-1947) అనే సబ్జెక్ట్‌లో ఈ ప్రశ్న వచ్చినట్టు వీసీ తెలిపారు. ఇది తాము తయారు చేసిన క్వశ్చన్ పేపర్ కాదని, వేరే యూనివర్సిటీ రూపొందించిందని చెప్పారు. ముందే ఈ విషయం దృష్టికి వచ్చుంటే ఈ తప్పిదం జరగకుండా చూసే వాడినని అన్నారు.





 


క్వశ్చన్ పేపర్ మేం తయారు చేయలేదు: వీసీ


"ఈ క్వశ్చన్ పేపర్ మేము తయారు చేయలేదు. ఎగ్జామ్ పేపర్స్ లీక్‌ అయ్యే అవకాశముందని, ముందుగా మేం ఆ పేపర్‌ను చదవం. ఈ వివాదాస్పద ప్రశ్నకు సంబంధించిన నాకెలాంటి సమాచారం అందలేదు. విచారణ జరిపి తీరుతాం" అని వీసీ జగన్నాథన్ స్పష్టం చేశారు.