Tamil Nadu High Court refused to hand over the Karoor stampede case:  మద్రాస్ హైకోర్టులో టీవీకే పార్టీకి తీవ్ర చుక్కెదురు అయింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు డిమాండ్‌ను హైకోర్టు తిరస్కరించింది.  తమిళగ వెట్రి కழగం (టీవీకే) పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు  తోసిపుచ్చింది.  సెప్టెంబర్ 27న టీవీకే అధినేత, నటుడు విజయ్ రోడ్ షో సమయంలో జరిగిన ఈ ఘటనలో 41 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన విచారణను సీబీఐ దర్యాప్తుకు బదిలీ చేయాలని టీవీకే వేసిన పిటిషన్‌పై మదురై బెంచ్‌లోని జస్టిస్ ఎన్. సెంథిల్‌కుమార్ ఆదేశాలు ఇచ్చారు.

Continues below advertisement

కేసు దర్యాప్తు మొదటి దశలో ఉండటం, పిటిషనర్ బాధితుడు కాకపోవడం వంటి కారణాలతో సీబీఐ దర్యాప్తు అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. "కేసు ప్రారంభ దశలో ఉన్నందున ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము" అని జస్టిస్ సెంథిల్‌కుమార్ స్పష్టం చేశారు. అదే సమయంలో కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చకూడదని హెచ్చరించారు. ఈ ఘటనపై డీఎంఎస్‌కె వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్‌ను కూడా తిరస్కరించారు. పిటిషనర్ బాధితుడు కాదని గుర్తిచంిది. 

టీవీకే కు హైకోర్టు ప్రశ్నలు: సౌకర్యాలు లేకుండా సభ ఎలా?

Continues below advertisement

హైకోర్టు  టీవీకే పార్టీ తీరును ప్రశ్నించింది.  "నీళ్లు, ఆహారం, స్వచ్ఛతా సదుపాయాలు ఏవీ ఏర్పాటు చేయకుండా సభను ఎలా నిర్వహించారు?" అని జస్టిస్ సెంథిల్‌కుమార్  టీవీకే తరపు లాయర్ ను ప్రశ్నించారు. రోడ్ షో సమయంలో టీవీకే క్యాడర్ అరాచకత్వం చేసి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేశారని కూడా కోర్టు గుర్తించింది. ఈ కారణాలతో టీవీకే నమక్కల్ జిల్లా సెక్రటరీ ఎన్. సతీష్ కుమార్‌కు  ముందస్తు బెయిల్ అభ్యర్థనను కూడా తిరస్కరించారు. పో"ఇటువంటి రోడ్ షో ఏర్పాటుకు అనుమతి ఎందుకు ఇచ్చారు?" అని లీసులపై కూడా కోర్టు ప్రశ్నించింది. 

టీవీకే జనరల్ సెక్రటరీ అర్జున్ దాఖలు చేసిన ఆఫిడవిట్‌లో, ఈ తొక్కిసలాట ఘటనను "ప్రభుత్వ  ప్రేరేపిత కుట్ర"గా పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వం, పోలీసులు, స్థానిక రాజకీయవేత్తలు కలిసి ఈ ఘటనను జరిగేలా చేశారని ఆరోపించారు. విజయ్ రోడ్ షోకు  7 గంటల వరకు ఆలస్యం కలిగించి, విద్యుత్ కట్ చేశారని.. తర్వాత  పోలీసులు లాఠీఛార్జ్ చేశారని ఆరోపణలు చేశారు. 40 మంది మరణించిన ఈ ఘటనలో 9 మంది పిల్లలు ఉన్నారని, ఆసుపత్రుల  వద్ద సౌకర్యాలు లేకపోవడం లేకపోవడం, అర్థరాత్రి పోస్ట్‌మార్టమ్‌లు చేయడం అన్నీ ముందుగా ప్లాన్ చేసిన కుట్రలు అని టీవీకే పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ జడ్జి అరుణా జగదీశన్ విచారణను  తప్పులను తప్పించుకునే కుట్రగా వాదించింది. బాధిత కుటుంబాలకు పరిహారం పెంచాలనే అభ్యర్థనపై కోర్టు ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ₹2 లక్షలు మరణించినవారి కుటుంబాలకు, ₹50 వేలు గాయపడినవారికి ప్రకటించారు.  

కోర్టు రాజకీయ పార్టీలకు హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్ సభల్లో తాగునీరు, స్వచ్ఛత, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని సూచించింది. విధివిధానాలు రూపొందించే వరకు పెద్ద రోడ్ షోలకు అనుమతులు ఇవ్వవద్దని ప్రభుత్వానికి ఆదేశించారు. ఈ ఘటనలో 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి, టీవీకే క్యాడర్‌పై చర్యలు తీసుకుంటున్నారు.