Bigg Boss Telugu 9 Latest Promo on Captaincy Tasks : బిగ్​బాస్​ సీజన్ 9 తెలుగులో నాలుగోవారం కెప్టెన్​గా ఎన్నుకునే ప్రక్రియ చివరికి వచ్చేసింది. ఈ వారం అంతా టాస్కులతో గట్టిగా ప్లాన్ చేసిన బిగ్​బాస్.. చివరి ప్రక్రియను గట్టిగా ప్లాన్ చేశాడు. అయితే కెప్టెన్​ అయ్యేందుకు అందరూ తమ తమ ప్లాన్స్​తో వెళ్లారు. కానీ చివరికి ముందు నుంచి బాగా ఆడిన ఇద్దరు కంటెస్టెంట్లకు అన్యాయం జరిగేలా చేసింది. ఇంతకీ ఎవరికి అన్యాయం జరిగింది. రీజన్ ఏంటి అనేది తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. 

Continues below advertisement

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో ఎలా ఉందంటే.. 

వివిధ టాస్క్​లు ఆడినవారిలో కెప్టెన్ అయ్యేందుకు నలుగురుకి అవకాశం ఇచ్చాడు బిగ్​బాస్. రాము, రీతూ, కళ్యాణ, ఇమ్మూకి కెప్టెన్ అయ్యేందుకు అవకాశం ఇచ్చాడు. మీలో ఒకరు మాత్రమే నాలుగో కెప్టెన్ అవ్వగలరంటూ టాస్క్ గురించి చెప్పాడు. దీనిలో భాగంగా రెయిన్ డ్యాన్స్ ఇచ్చాడు బిగ్​బాస్. కెప్టెన్సీలో లేనివారు.. కెప్టెన్ అవ్వాలి అనుకునేవారికి సపోర్ట్ చేయాలంటే.. గంటను పట్టుకోవాలి. వారు డ్యాన్స్ వేసేలోపు కెప్టెన్సీ కంటెండర్స్ బ్లాక్​ని బ్లూ లైన్​లోకి తీసుకురావలని చెప్పాడు.

రీతూ ప్రభావం గట్టిగానే ఉందిగా..

ఇలా మొదలైన టాస్క్​లో ముందుగా డిమోన్ పవన్ గంటను పట్టుకున్నాడు. వానా వానా వెల్లువాయే అనే సాంగ్​కి డ్యాన్స్ వేశాడు. కంటెండర్స్ బాక్స్​ని బ్లూ లైన్​ దగ్గరికి తీసుకెళ్లపోతే.. డైరక్ట్​గా వారిలో ఒక పోటిదారుడిని కెప్టెన్సీ రేసునుంచి తప్పించవచ్చంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో డిమోన్ పవన్.. కళ్యాణ్​ను కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేశాడు. కోపంలో ఉన్న కళ్యాణ దగ్గరకు పవన్ రాగా లేచి వెళ్లిపోయాడు. అయితే రీతూ చెప్పిందనే పవన్.. కళ్యాణ్​ను తీసేసినట్లు ప్రోమోలో ఉంది. 

Continues below advertisement

ఫైనల్ కాల్ భరణిదే..

తర్వాత గంట పట్టుకున్న శ్రీజ.. ఇమ్మూని టాస్క్​నుంచి తొలగించింది. ఇప్పటికే ఇమ్మూ కెప్టెన్ అయ్యాడంటూ చెప్పుకొచ్చింది. కానీ నిజానికి ఇమ్మూ కెప్టెన్ అయినా.. గతవారం సంజన ఇమ్యూనిటీకోసం దానిని తిరిగి వెనక్కి ఇచ్చేశాడు. దీంతో బాగా ఆడిన కళ్యాణ్, ఇమ్మూ ఇద్దరూ డిజప్పాయింట్ అయ్యారు. చివరికి టాస్క్ రాము, రీతూ మధ్య పడింది. భరణి గంట పట్టుకోగా ఫైనల్ నిర్ణయం తేలనున్నట్లు ప్రోమోను ఎండ్ చేశారు. అయితే లైవ్ ప్రకారం రాము రాథోడ్ కెప్టెన్ అయిపోయాడు. రీతూ ఓడిపోయినట్లు తెలుస్తుంది. ఈరోజు ఎపిసోడ్​తో ఇమ్మూ, కళ్యాణ్​కి సింపతీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.