Just In





Rashtriya Bal Puraskar 2022: 'దేశమే మీ తొలి ప్రాధాన్యం కావాలి..' జాతీయ బాల పురస్కారాలు ప్రదానం
జాతీయ బాల పురస్కారాలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు అందించారు. అవార్డు గెలిచిన వారికి మెడల్‌తో పాటు రూ.లక్ష నగదు బహుమతి కూడా ఇచ్చారు.

2021, 2022 సంవత్సరాలకు గాను ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారాలను నరేంద్ర మోదీ ప్రదానం చేశారు. అవార్డ్ గ్రహీతలతో మాట్లాడి.. బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ సర్టిఫికెట్లను అందించారు.
ఈ ఏడాదికి 29 మంది పిల్లలు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఆయా జిల్లాల కలెక్టర్లు ఇందులో పాల్గొన్నారు. వోకల్ ఫర్ లోకల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని బాలలకు ప్రధాని సూచించారు. అవార్డు గెలిచిన బాలలకు మెడల్‌తో పాటు రూ.లక్ష నగదు బహుమతి, సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాకుండా పిల్లలతో ప్రధాని ముచ్చటించారు. వారు సాధించిన విజయాలను అడిగి తెలుసుకున్నారు. జీవితంలో మరిన్న విజయాలు సాధించాలని ఆశించారు.
దేశంలో ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు ఈ పురస్కారాలను ఇస్తారు. నూతన ఆవిష్కరణలు, క్రీడలు, శౌర్యపరాక్రమాలు, సాంస్కృతిక కళలు, సామాజిక సేవ, పాండిత్యం రంగాల్లో విజేతలకు ఈ బహుమతులు ప్రదానం చేస్తారు.
Also Read: Watch Video: ఎముకలు కొరికే చలిలో 40 సెకన్లలో 47 పుష్అప్స్.. సాహో సైనిక.. వీడియో వైరల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి