Muslim Personal Law Board:


సుప్రీంకోర్టులో అఫిడవిట్..


ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకూ మసీదులో నమాజ్ చేసుకునే హక్కు ఉందని సుప్రీం కోర్టుకి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. వాళ్లకూ మసీదులోకి అనుమతి ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే...మసీదులోకి వచ్చి ప్రార్థనలు చేసుకోవాలా వద్దా అన్నది వాళ్ల వ్యక్తిగత నిర్ణయమేనని స్పష్టం చేసింది. మహిళలు మసీదులోకి వెళ్లి నమాజ్‌ చేసుకోవాలనే పిటిషన్‌పై స్పందించిన ముస్లిం పర్సనల్ లా బోర్డ్...ఈ అఫిడవిట్‌ను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఈ బోర్డ్ తరపున ఓ అడ్వకేట్ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రార్థనా మందిరాలన్నీ ప్రైవేట్ వ్యక్తుల అధీనంలో ఉంటాయని, వాటిని ప్రైవేట్ వ్యక్తులే కంట్రోల్ చేస్తున్నారని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. 2020లోనే సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది. మసీదులోకి మహిళలను అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీనిపై AIMPLB వివరణ ఇచ్చింది. వీటిపై నిర్ణయం తీసుకునే హక్కు తమకు లేదని స్పష్టం చేసింది. దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయమని వెల్లడించింది. మహిళలూ నమాజ్ చేసుకోవచ్చని తేల్చి చెప్పింది. అయితే...ఇస్లాం ప్రకారం రోజుకు 5 సార్లు నమాజ్ చేసుకోవాలన్న నిబంధన మాత్రం మహిళలకు వర్తించదని తెలిపింది. మసీదులోకి వచ్చి ప్రార్థనలు చేసినా...ఇంట్లోనే ప్రార్థించినా ప్రతిఫలం ఒకేలా ఉంటుందని చెప్పింది. 






భర్త అంగీకారం లేకున్నా ముస్లిం మహిళలు విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చని గతేడాది నవంబర్‌లో కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇస్లామిక్ చట్టం ప్రకారం ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవడానికి భర్త అనుమతి అవసరం లేదని కోర్టు పేర్కొంది. వివాహాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసే ముస్లిం మహిళ హక్కును ఇస్లామిక్ చట్టం గుర్తిస్తుందని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు జ‌స్టిస్ మ‌హ‌మ్మ‌ద్ ముస్తాక్‌, జ‌స్టిస్ సీఎస్ డ‌యాస్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఓ కేసులో 59 పేజీల తీర్పును ఇచ్చింది. 


భ‌ర్త అంగీకారం లేకున్నా ముస్లిం మ‌హిళలు విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆ మ‌హిళ‌ల‌కు భర్త భ‌ర‌ణం కూడా ఇవ్వాలి. భ‌ర్త అంగీక‌రించ‌కున్నా కులా విధానాన్ని అమ‌లు చేయ‌వ‌చ్చు. ముస్లిం మ‌హిళ ఎప్పుడైనా త‌న వివాహ బంధాన్ని బ్రేక్ చేయ‌వ‌చ్చు. ప‌విత్ర ఖురాన్ కూడా ఈ విధానాన్ని అంగీక‌రిస్తుంది. భ‌ర్త అంగీకారం ఉన్నా లేకున్నా విడాకులు తీసుకోవ‌చ్చు.                                                                  "-  కేరళ హైకోర్టు


Also Read: Twitter Blue in India: ఇండియాలోనూ ట్విటర్ బ్లూ ఫీచర్, బ్లూ టిక్ కావాలంటే ఇంత కట్టాల్సిందే