Agnipath Recruitment: త్రివిధదళాల్లో చేరే వారి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ స్కీంకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. గత జూన్‌లో కేంద్రం ‘అగ్నిపథ్’ స్కీం ప్రవేశపెట్టింది. భారత సైన్యంలో నాలుగేళ్ల సర్వీసుకుగాను ఈ స్కీం ద్వారా నియామకాలు చేపడుతారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నాలుగేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో సైన్యంలోకి తీసుకుంటారు. ఇలా ఎంపికైన వారు 15 ఏళ్లు సైన్యంలో కొనసాగాల్సి ఉంటుంది.
అయితే, ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత ఆందోళన బాట పట్టింది. తెలంగాణ, బిహార్ సహా పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగానూ మారాయి. ఈ పథకాన్ని రద్దు చేయాలని ఆర్మీలో చేరాలనుకుంటున్న యువత డిమాండ్ చేసింది. పూర్తిస్థాయి నియామకాలు చేపట్టాలని కోరింది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
అక్రమ మద్యం కేసులో కుక్క అరెస్ట్ - ఆ తర్వాత ప్రారంభమయ్యాయి పోలీసుల కష్టాలు !
మరోవైపు ఎన్ని నిరసనలు వ్యక్తమైనప్పటికీ కేంద్రం ఈ పథకంపై ముందుకే వెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే నియామకాల నోటిఫికేషన్ జారీ చేసింది. కొవిడ్ కారణంగా రెండేళ్ల నుంచి రిక్రూట్‌మెంట్ చేపట్టకపోవడంతో.. ఆ మేరకు అర్హత వయసు రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగాలకు 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులుగా ఉండగా.. ఈ ఏడాదికి ఆ పరిమితిని 23 ఏళ్లకు పెంచింది.దీనికి యువత నుంచి స్పందన బాగానే ఉందని కేంద్రం చెబుతోంది.
షిండే సార్ ఈ సారి నన్నూ గౌహతి తీసుకెళ్లండి సీఎం అవుతా ! ఆ పాప అమాయకంగా అడిగిందా ? పంచ్ వేసిందా ?
ఎంపికైన వారు అగ్నివీరులుగా నాలుగేళ్ల పాటు సేవలు అందిస్తారు. ఆ తర్వాత 25 శాతం మందిని శాశ్వత కేడర్‌కు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. మిగిలిన 75 శాతం మంది పెన్షన్ లేకుండా రిలీవ్ అవుతారు. అయితే, రిలీవ్ సమయంలో కేంద్రం వారికి సుమారు రూ.11 లక్షలు ఇవ్వనుంది. అయితే దీనిపై యువత తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.