ABP  WhatsApp

Supreme Court: చట్టాన్ని నిలిపివేయాలా..? మా మాటంటే కేంద్రానికి లెక్క లేదు: సుప్రీం

ABP Desam Updated at: 06 Sep 2021 08:36 PM (IST)
Edited By: Murali Krishna

ట్రిబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని సుప్రీం కోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఇచ్చే తీర్పులపై గౌరవం లేనట్టుగా కేంద్రం చర్యలు ఉన్నాయని వ్యాఖ్యానించింది.

కేంద్రంపై సుప్రీం ఫైర్

NEXT PREV

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం నిర్ణయాలను ప్రభుత్వం గౌరవించడం లేదని.. కోర్టు సహనాన్ని పరీక్షించవద్దని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా ఉన్న ట్రిబ్యునల్స్‌లో ఖాళీలు భర్తీ చేయకపోవడంపై, ట్రిబ్యునల్‌ సంస్కరణల చట్టాన్ని ఆమోదించకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.






ట్రిబ్యునళ్లలో ఖాళీల భర్తీపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్బంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.


Also Read: Covid-19 Symptoms: కరోనా సరికొత్త లక్షణాలు.. ఓసారి చెక్ చేసుకోండి ఉన్నాయేమో!



ఇప్పటివరకు ఎంత మందిని నియమించారు? కొందరి నియామకాలు ఉన్నాయని చెప్పారు. ఈ నియామకాలు ఎక్కడ ఉన్నాయి? మద్రాస్‌ బార్‌ అసోసియేషన్‌లో రద్దు చేసిన నిబంధనలు ట్రిబ్యునల్‌ చట్టాన్ని పోలి ఉన్నాయి. మీకు ఇచ్చిన సూచనల ప్రకారం ఎందుకు నియామకాలు జరగలేదు. నియామకాలు జరపకుండా ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను బలహీనపరుస్తోంది. చాలా ట్రిబ్యునల్స్‌ మూసివేత దశలో ఉన్నాయి. ఈ పరిస్థితులపై చాలా అసంతృప్తితో ఉన్నాం. ఇప్పుడు మాకు మూడు ఆప్షన్‌లు ఉన్నాయి. మొదటిది చట్టాన్ని నిలిపివేయడం, రెండోది ట్రిబ్యునల్‌ను మూసివేసి వాటి అధికారాలను కోర్టుకు అప్పగించడం, మూడోది మేమే ఆ నియామకాలు చేపట్టడం. -                                సుప్రీం ధర్మాసనం 


Also Read: Nipah Virus: నిఫా- కరోనా ఒకేసారి వస్తే? ఈ వైరస్ గురించి షాకింగ్ విషయాలివే


అయితే వీటిపై సమాధానమిచ్చేందుకు 2-3 రోజుల సమయం కావాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరారు.  దీంతో విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఆలోగా నియామకాలు జరుగుతాయని భావిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. 


Also Read: Kerala HC on Covid19: 'కొవిషీల్డ్ రెండో డోసు 4 వారాల తర్వాత ఇచ్చేయండి'

Published at: 06 Sep 2021 08:24 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.