Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్‌కి ఊరట లభించింది. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. ఈ కేసుని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్‌లో పలు కీలక అంశాలతో పాటు సెక్షన్లను పరిశీలించాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈడీ కేసులో ఇంకా కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు వాదించారు. తన అరెస్ట్ అక్రమమని కేజ్రీవాల్ పిటిషన్ వేయగా...ఈ పిటిషన్‌ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది కోర్టు. దీనిపై ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.


అరెస్ట్‌ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు..


బెయిల్ వచ్చినప్పటికీ ఆయన జైల్‌లోనే ఉండక తప్పదు. ఇదే కేసులో ఆయనను CBI విచారిస్తోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. 90 రోజుల పాటు కేజ్రీవాల్‌ జైల్లో ఇబ్బంది పడ్డారని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అన్న సంగతి గుర్తుంచుకోవాలని వెల్లడించింది. ఏప్రిల్ 9వ తేదీన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌కి బెయిల్‌ని తిరస్కరించింది. కేజ్రీవాల్ అరెస్ట్‌ని సమర్థించింది. ఇందులో ఎలాంటి అక్రమం లేదని తేల్చి చెప్పింది. 






"సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కి భారీ ఊరటనిచ్చింది. ఈ కేసు నమోదైనప్పటి నుంచి మేం ఒకే విషయం చెబుతున్నాం. మనీలాండరింగ్ జరగలేదని,అవన్నీ అవాస్తవం అని వాదిస్తున్నాం. మనీలాండరింగ్‌ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. FIRలో కేజ్రీవాల్ పేరు కూడా లేదు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యమూ లేదు. ఇప్పటి వరకూ ఈడీ ఎలాంటి ఆధారాలు బయటపెట్టలేదు. కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయాల్సిన అవసరాన్ని బలపరిచేలా ఎలాంటి ప్రూఫ్‌లనీ ఇవ్వలేదు. ఇది కేవలం రాజకీయ కుట్ర మాత్రమే"


- అడ్వకేట్ సంజీవ్ నజీర్, ఆప్‌ లీగల్ సెల్‌






Also Read: Indian Railways: ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన