Lok Sabha Polls 2024: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ని నిరసిస్తూ I.N.D.I.A కూటమిలోని కీలక నేతలంతా ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తరవాత రామ్‌లీలా మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండి పడ్డారు. ప్రతిపక్షాల్ని అణిచివేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకూ బీజేపీపై విమర్శలు చేసినప్పటికీ...ఈ సారి పూర్తిగా పొలిటికల్ స్పీచ్‌తో విరుచుకుపడ్డారు. అంతే కాదు. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోనీ అధికారికంగా ప్రకటించారు. జైల్‌లో ఉన్న తన భర్త చెప్పిందే తాను చెబుతున్నట్టు వెల్లడించారు. మొత్తం ఆరు హామీలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న పేదలకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా విద్యుత్ కోతల్ లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన పిల్లలకు సమాన విద్యావకాశాలు కల్పిస్తామని తెలిపారు. వీటితో పాటు మరి కొన్ని హామీలనూ (AAP Six Guarantees) వెల్లడించారు.
"దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు లేకుండా చూస్తాం. నిరుపేదలకు ఉచితంగా విద్యుత్ అందిస్తాం. ప్రతి గ్రామంలోనూ మంచి స్కూల్స్ ఏర్పాటు చేస్తాం. అన్ని వర్గాల పిల్లలకు సమాన విద్యావకాశాలు దక్కేలా చూస్తాం. ప్రతి గ్రామంలో ఓ మొహల్లా క్లినిక్, జిల్లాలో మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ నిర్మిస్తాం. స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా రైతులకు కనీస మద్దతు ధర అమలు చేస్తాం. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పిస్తాం. చాలా రోజులుగా ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్న ఈ డిమాండ్‌ని నెరవేరుస్తాం"
- సునీత కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ భార్య
ఈ సభలో కీలక ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, ఉద్దవ్ థాక్రే, మెహబూబా ముఫ్తీ, మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. దేశ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌కి మద్దతుగా ఉంటారని వెల్లడించారు. ఆయనను ఎప్పటికీ జైల్లో ఉంచలేరని సునీత కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. తాను ఓట్లు అడగడం లేదని, ఈ దేశం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తమకి సాయం చేయాలని కోరుతున్నామని వెల్లడించారు. ఐదేళ్లలో తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని స్పష్టం చేశారు సునీత కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మార్చి 21వ తేదీన అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ స్కామ్ సూత్రధారి కేజ్రీవాలేనని ఇప్పటికే ఈడీ కోర్టుకి వెల్లడించింది. అటు కేజ్రీవాల్ మాత్రం ఇది తప్పుడు కేసు అని తేల్చి చెబుతున్నారు. రాజకీయ కుట్ర అని మండి పడుతున్నారు.
Also Read: Lok Sabha Elections 2024: ఈ సారి లోక్‌సభ ఎన్నికలకు సినీ రంగులు, రేసులో ఉన్న కీలక నటులు వీళ్లే